Paytm ఫాస్ట్ ట్యాగ్ మార్చుకోవాలా వద్దా.. RBI ఏం చెబుతోంది.!

Paytm ఫాస్ట్ ట్యాగ్ మార్చుకోవాలా వద్దా.. RBI ఏం చెబుతోంది.!

 నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) తరఫున టోల్‌ వసూలు చేసే జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ ను ఆర్బీఐ తొలగించిన సంగతి తెలిసిందే. అయితే  మార్చి 15 తర్వాత  ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం కొనసాగించాలంటే  ఆర్బీఐ పేర్కొన్న బ్యాంకుల నుంచే ఫాస్టాగ్‌లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఐహెచ్‌ఎంసీఎల్‌ పేర్కొన్న జాబితాలో ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌, అలహాబాద్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐడీబీఐ బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, యెస్‌ బ్యాంక్‌ సహా మొత్తం 32 బ్యాంకులు ఉన్నాయి. 

పేటీఎం ఫాస్టాగ్  కస్టమర్లు తమ అకౌంట్ లో ఉన్న  బ్యాలెన్స్ ను ట్రాన్స్ ఫర్ చేయడానికి వీలు లేదు కాబట్టి..  మార్చి 15 లోపు వాడుకోవాలి.  తర్వాత ఫాస్టాగ్ పేటీఎం పేమెంట్ బ్యాంకు నుంచి టోల్ ఫీజులు  చెల్లించడానికి వీల్లేదు. ఆ తేది లోపు ఇతర బ్యాంకులకు ఫాస్టాగ్ అకౌంట్ ను  మార్చుకోవాలని ఆర్బీఐ సూచించింది.  ఒకవేళ పేటీఎం ఫాస్ట్ టాగ్ అంకౌంట్ ఉంటే దాన్ని వేరే బ్యాంక్ కు మార్చుకోవచ్చు, లేదా డియాక్టివేట్ చేయవచ్చని తెలిపింది.   అలాగే  ఫాస్ట్ ట్యాగ్  యూజర్లంతా ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం తమ కేవైసీ  ప్రక్రియను పూర్తి చేయాలని ఐహెచ్‌ఎంసీఎల్‌ సూచించింది.

మీ Paytm ఫాస్ట్‌ట్యాగ్‌ని ఎలా డీయాక్టివేట్ చేయాలంటే..?

  •  FASTag Paytm పోర్టల్‌ లోకి యూజర్ ఐడీ లేదా వాలెట్ ఐడీ, పాస్‌వర్డ్ తో లాగిన్ అవ్వండి
  • తర్వాత ఫాస్ట్ టాగ్ రిజిస్ట్రేషన్ నెంబర్, మొబైల్ నెంబర్ తో వెరిఫికేషన్ పూర్తి చేసుకోండి.
  • పోర్టల్‌లోని సర్వీస్ రిక్వెస్ట్ లోకి వెళ్లి ది ఫాస్ట్‌ ట్యాగ్ కేటగిరీని ఎంచుకోండి.
  •  పేజీని క్రిందికి స్క్రోల్ చేసి హెల్ప్ & సపోర్ట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • అక్కడ ఫాస్ట్ టాగ్ డియాక్టివేట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • దీని తర్వాత ఎందుకు మీ అకౌంట్ డిలెట్ చేయాలకుంటున్నారో రీజన్ ఎంచుకోండి. 
  • మీ రిక్వెస్ట్ పై ఓ రిఫరెన్స్ నెంబర్ క్రియేట్ అవుతోంది. దాన్ని మీ దగ్గర ఉంచుకోవాలి. ఈ ప్రాసెస్ పూర్తైన తర్వాత కొంత సమయానికి ఫాస్ట్ టాగ్ అకౌంట్ డియాక్టివేట్ అవుతోంది. 
  • ఒకసారి మీ ఫాస్ట్ టాగ్ అకౌంట్ డియాక్టివేట్ అయితే మళ్లీ ఆ అకౌంట్ పొందలేరు.