Gold Rate: ట్రంప్ టారిఫ్స్ ఆగ్రహం.. మళ్లీ పెరుగుతున్న గోల్డ్, హైదరాబాదులో రేటెంతంటే..

Gold Rate: ట్రంప్ టారిఫ్స్ ఆగ్రహం.. మళ్లీ పెరుగుతున్న గోల్డ్, హైదరాబాదులో రేటెంతంటే..

Gold Price Today: అమెరికాతో భారత్ ట్రేడ్ డీల్ ఇప్పటికీ ఫైనల్ కాలేదు. భారత్ జన్యుపరంగా మార్పిడిచేసిన ఆహార ఉత్పత్తులు, డెయిరీ వస్తువులను ఇండియాకు దిగుమతులకు నిరాకరించటంతో డీల్ ఆలస్యం అవుతోంది. ఈ క్రమంలోనే ట్రంప్ కొన్ని దేశాలకు అదనపు టారిఫ్స్ ప్రకటిస్తూ లేఖలు పంపటం ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. దీంతో అప్రమత్తం అవుతున్న ఇన్వెస్టర్లు గోల్డ్, సిల్వర్ వంటి లోహాల వైపు చూస్తుండటం రేట్లను అమాంతం పెంచేస్తోందని నిపుణులు చెబుతున్నారు. 

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.5వేల భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 060, ముంబైలో రూ.9వేల 060, దిల్లీలో రూ.9వేల 075, కలకత్తాలో రూ.9వేల 060, బెంగళూరులో రూ.9వేల 060, కేరళలో రూ.9వేల 060, పూణేలో రూ.9వేల 060, వడోదరలో రూ.9వేల 065, జైపూరులో రూ.9వేల 075, లక్నోలో రూ.9వేల 075, కోయంబత్తూరులో రూ.9వేల 060, మంగళూరులో రూ.9వేల 060, నాశిక్ లో రూ.9వేల 063, అయోధ్యలో రూ.9వేల 075, బళ్లారిలో రూ.9వేల 060, నోయిడాలో రూ.9వేల 075, గురుగ్రాములో రూ.9వేల 075 వద్ద కొనసాగుతున్నాయి. 

ALSO READ : లూమియో నుంచి 2 కొత్త ప్రొజెక్టర్లు

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.5వేల 500 భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేటి రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 884, ముంబైలో రూ.9వేల 884, దిల్లీలో రూ.9వేల 899, కలకత్తాలో రూ.9వేల 884, బెంగళూరులో రూ.9వేల 884, కేరళలో రూ.9వేల 884, పూణేలో రూ.9వేల 884, వడోదరలో రూ.9వేల 889, జైపూరులో రూ.9వేల 899, లక్నోలో రూ.9వేల 899, కోయంబత్తూరులో రూ.9వేల 884, మంగళూరులో రూ.9వేల 884, నాశిక్ లో రూ.9వేల 887, అయోధ్యలో రూ.9వేల 899, బళ్లారిలో రూ.9వేల 884, నోయిడాలో రూ.9వేల 899, గురుగ్రాములో రూ.9వేల 899గా ఉన్నాయి. 

ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.90వేల 600 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర తులానికి రూ.98వేల 840గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 20వేల వద్ద ఉంది.