గోల్డు రేట్లు భారీగా ఫాల్.. ర్యాలీకి బ్రేక్ పడినట్లేనా.. హైదరాబాద్లో 24 క్యారెట్స్ తులం ధర ఎంతంటే..

గోల్డు రేట్లు భారీగా ఫాల్.. ర్యాలీకి బ్రేక్ పడినట్లేనా.. హైదరాబాద్లో 24 క్యారెట్స్ తులం ధర ఎంతంటే..
  • బంగారం పైకి, కిందికి! 
  • రూ.3 వేలు పెరిగిన వెండి.. కిలో రూ.2 లక్షలకు చేరువలో
  • కొనేందుకు వెనుకాడుతున్న జనం

హైదరాబాద్, వెలుగు:
 కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు ఒకదాంతో ఒకటి పోటీపడుతున్నాయి. బంగారం రేట్లు ప్రతిరోజూ సరికొత్త రికార్డ్ సృష్టిస్తూ సామాన్యులకు అందనంత దూరానికి చేరుకున్నాయి. ఒకానొక దశలో రూ.1.50 లక్షలు దాటుతుందని మార్కెట్ నిపుణులు భావించారు. ఎట్టకేలకు పసిడి ధర పరుగుకు బ్రేక్ పడింది. శుక్రవారం (అక్టోబర్ 10) బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,22,290కు చేరింది. 

ఒక్కరోజులోనే రూ.1,860 దిగిరావడంతో కొనుగోలుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 22 క్యారెట్ల 10 గ్రాములు ధర రూ.1,13,800 పలికింది. అలాగే, 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.91,720గా ఉంది. బంగారం ధరలు దిగొస్తున్నాయనుకుంటున్న టైమ్​లోనే వెండి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. సిల్వర్ ధర ఆల్‌‌టైమ్‌‌ హైకి చేరింది. 

ఏకంగా రూ.2 లక్షల చేరువలోకి వెళ్లింది. శుక్రవారం హైదరాబాద్‌‌లో కిలో వెండిపై రూ.3,000 పెరిగి.. ధర రూ.1,80,000కు చేరింది. కేవలం 5 రోజుల్లోనే కిలో వెండి రూ.15 వేలు పెరిగింది. రానున్న రోజుల్లో వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌‌ నిపుణులు చెప్తున్నారు.

-హెచ్చుతగ్గులతో కొనుగోళ్లకు వెనుకంజ

కొంతకాలంగా బంగారం, వెండి ధరల్లో నిలకడం లేకుండాపోయింది. ఒకరోజు ధరలు పెరిగితే.. మరోరోజు తగ్గుతున్నాయి. లేదా.. రికార్డ్ స్థాయి ధరతో కొనుగోలుదారులు, వ్యాపారులను ఆందోళనకు గురి చేస్తున్నది. ఈ హెచ్చుతగ్గులతో బంగారం, వెండి కొనాలా? వద్దా? అన్న డైలమాలో పడ్తున్నారు. ఒకవేళ ఇప్పుడే కొంటే.. మున్ముందు తగ్గుతుందేమోనని ఆలోచిస్తున్నారు. 

ఇప్పుడు కొనకపోతే.. భవిష్యత్ లో పెరిగితే ఎలా? అని భయపడుతున్నారు. గోల్డ్ రేట్స్ లో స్థిరత్వం లేకపోవడంతో వినియోగదారులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారని వ్యాపారులు పేర్కొంటున్నారు. అయితే, దీపావళి పండుగతో పాటు పెండ్లిళ్లకు ముందు ధరల తగ్గడంతో కొంత రిలీఫ్ కలిగించినా.. ఇది ఎన్నిరోజులు ఉంటుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పండుగ సీజన్​లో ధరలు ఇలాగే తగ్గితే జ్యువెలరీ షాపుల్లో గిరాకీ పెరుగుతుందని పేర్కొంటున్నారు. 

నెలరోజులుగా పెరుగుతూ వచ్చిన గోల్డ్ రేట్స్ ఇప్పుడు దిగివస్తుండటం మార్కెట్లో మళ్లీ ఉత్సాహం కనిపిస్తున్నది. గోల్డ్ షాపులు కళకళలాడనున్నాయి. మార్కెట్ ట్రెండ్ ను గమనిస్తూ కొనుగోలు చేయాలని, పెండిళ్లు, ఇతర శుభకార్యాల కోసం ముందుగానే ప్లాన్ చేసుకోవాలని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.