అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డెడ్ లైన్ ముగింపునకు వస్తున్న వేళ ఇరాన్ లో పరిస్థితులు మరింతగా దిగజారుతున్నాయి. ఒకపక్క ఇజ్రాయెల్ దాడులు పెంచటంతో పాటు రేపు అమెరికా కూడా రంగంలోకి దిగేందుకు సిద్ధం అవుతున్న వేళ బులియన్ మార్కెట్లు నిరాశలో ఉన్నాయి. బంగారం రేట్లు తగ్గుతూపోతోంటే.. వెండిలో మాత్రం చలనం కనిపించటం లేదు. ఈ క్రమంలో షాపింగ్ చేయాలనుకుంటున్న వారు తెలుగు రాష్ట్రాల్లోని తాజా రేట్లను పరిశీలించటం ముఖ్యం.
ఏప్రిల్7న బంగారం రేట్లు స్వల్పంగా తగ్గాయి. ఏప్రిల్6 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.82 తగ్గింది. అయితే హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 984గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 735గా కొనసాగుతోంది.
మంగళవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. ఏప్రిల్7, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా ఉంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు స్థిరంగా రూ.2లక్షల 55వేల వద్ద కొనసాగుతోంది. అంటే గ్రాము ధర ఎలాంటి మార్పులు లేకుండా రూ.255గా అమ్మకాలు జరుగుతున్నాయి.
