బంగారం ధర గురువారం ఆల్ టైమ్ హైని తాకింది. మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్‌లో 10 గ్రాముల గోల్డ్ రూ.61, 845కి చేరింది. హైదరాబాద్‌లో 10 గ్రాములు (24 క్యారెట్లు) రూ.63,530 పలుకుతోంది. 22 క్యారెట్ల గోల్డ్ రూ.62,260కి పెరిగింది. అంచనాలకు తగ్గట్టుగా ఫెడ్ వడ్డీ రేట్లను పెంచినా.. డాలర్ వ్యాల్యూ పడిపోతుండడంతో గోల్డ్‌కు డిమాండ్ పెరిగిందని మార్కెట్ నిపుణులు వెల్లడించారు. మేజర్ కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలహీనంగా ఉండడం వల్లే బంగారం ధరలు పెరిగాయని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరింత పెరుగుతుందని అంచనా వేశారు. 10 గ్రాముల గోల్డ్ త్వరలో రూ.62 వేలను టచ్ చేస్తుందని తెలిపారు.
