Diwali 2023 : ఐదు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు

Diwali 2023 : ఐదు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు

హైదరాబాద్‌లో ఐదు రోజుల నుంచి  బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి.   అంటే 2023 నవంబర్ 03 నుంచి 07 వరకు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. నవంబర్ 03న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.  56 వేల 600 ఉండగా, 24  క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.  61 వేల 750 గా ఉంది.  ఇక ఈ రోజున ( నవంబర్ 07)న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.  56 వేల 250 ఉండగా, 24  క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.  61 వేల 360 గా ఉంది. 

ఈరోజు హైదరాబాద్‌లో బంగారం ధరలు వరుసగా 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ.56 వేల 250 , 24 క్యారెట్ల బంగారం ధర రూ.61 వేల 360 గా ఉంది.  అక్టోబరు నెలలో, హైదరాబాద్‌లో బంగారం ధరలు 6 శాతానికి పైగా పెరిగాయి. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా  ధరలు పెరగగా,  ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి.  

దీపావళి పండగ సీజన్ నేపథ్యంలో బంగారం ధరలు తగ్గడం మహిళలకు పెద్ద ఊరట అని చెప్పొచ్చు. ఈ సమయంలో బంగారానికి మంచి డిమాండ్ ఉంటుంది. చాలా మంది మహిళలు  పండుగ రోజున బంగారం కొనేందుకు ఇష్టపడుతుంటారు.  బంగారం ధర పతనమైనప్పటికీ.. వెండి రేటు మాత్రం పుంజుకుంది.  తాజాగా కిలో వెండి రూ. 200 ఎగబాకి ప్రస్తుతం రూ. 75,200 వద్ద ఉంది. ఇక హైదరాబాద్‌లో అయితే రూ. 200 పెరిగి కేజీ సిల్వర్ రేటు రూ. 78,200 వద్ద కొనసాగుతోంది.