Gold Rate: తులం రూ.లక్ష కిందకి తగ్గనంటున్న గోల్డ్.. సోమవారం హైదరాబాద్ రేట్లివే..

Gold Rate: తులం రూ.లక్ష కిందకి తగ్గనంటున్న గోల్డ్.. సోమవారం హైదరాబాద్ రేట్లివే..

Gold Price Today: 2025 ప్రారంభం నుంచి పసిడి ధరలు ఏకంగా 30 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ అనిశ్చితులతో పాటు పాలసీ ఆందోళనలు దీనికి కారణంగా జేపీ మోర్గన్ రీసెర్చ్ అంచనా వేస్తోంది. అయితే రానున్న కొద్ది రోజుల్లో ఔన్సు ధర 4వేల డాలర్లకు చేరుకుంటుందని భావిస్తోంది. ఈ పరిస్థితులు ఆర్థిక మాంద్యాన్ని సూచిస్తున్నాయని, అలాగే అమెరికా వాణిజ్య సుంకాలే కారణంగా అనలిస్ట్ నటాషా కనేనా వెల్లడించారు.

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.వెయ్యి పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 180, ముంబైలో రూ.9వేల 180, దిల్లీలో రూ.9వేల 195, కలకత్తాలో రూ.9వేల 180, బెంగళూరులో రూ.9వేల 180, కేరళలో రూ.9వేల 180, పూణేలో రూ.9వేల 180, వడోదరలో రూ.9వేల 185, జైపూరులో రూ.9వేల 195, లక్నోలో రూ.9వేల 195, మంగళూరులో రూ.9వేల 180, నాశిక్ లో రూ.9వేల 183, అయోధ్యలో రూ.9వేల 195, మైసూరులో రూ.9వేల 180, నోయిడాలో రూ.9వేల 195, బళ్లారిలో రూ.9వేల 180, గురుగ్రాములో రూ.9వేల 195 వద్ద కొనసాగుతున్నాయి. 

ALSO READ : Indian Stock Market: ఈ వారం రిజల్ట్స్‌‌ పైన ఫోకస్‌‌.. మార్కెట్‌‌ డైరెక్షన్‌‌ను ఇవి నిర్ణయించే అవకాశం

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.1100 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.10వేల 015, ముంబైలో రూ.10వేల 015, దిల్లీలో రూ.10వేల 030, కలకత్తాలో రూ.10వేల 015, బెంగళూరులో రూ.10వేల 015, కేరళలో రూ.10వేల 015, పూణేలో రూ.10వేల 015, వడోదరలో రూ.10వేల 020, జైపూరులో రూ.10వేల 030, లక్నోలో రూ.10వేల 030, మంగళూరులో రూ.10వేల 015, నాశిక్ లో రూ.10వేల 018, అయోధ్యలో రూ.10వేల 030, మైసూరులో రూ.10వేల 015, నోయిడాలో రూ.10వేల 030, బళ్లారిలో రూ.10వేల 015, గురుగ్రాములో రూ.10వేల 030గా ఉన్నాయి. 

ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.91వేల 800 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర తులానికి రూ.లక్ష 150 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 26వేల వద్ద ఉంది.