Gold Rate: సరికొత్త రికార్డులకు చేరిన గోల్డ్.. ఏపీ, తెలంగాణ ఇవాళ్టి రేట్లివే..

Gold Rate: సరికొత్త రికార్డులకు చేరిన గోల్డ్.. ఏపీ, తెలంగాణ ఇవాళ్టి రేట్లివే..

Gold Price Today: ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులతో పాటు.. రాజకీయ, ఆర్థిక సంక్లిష్టతలు బులియన్ మార్కెట్లను బుల్ జోరుతో కొనసాగేలా చేస్తున్నాయి. దీంతో బంగారం, వెండి రేట్లు చరిత్రలో ఎన్నడూ చూడని సరికొత్త గరిష్ఠ స్థాయిలకు పెరిగిపోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మధ్యతరగతి మాత్రం రేట్లు ఇలాగే పెరగటం కొనసాగిస్తే కలలో కూడా బంగారం, వెండి కొనటం కష్టమే అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

24 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే సెప్టెంబర్ 9తో పోల్చితే 10 గ్రాములకు సెప్టెంబర్ 10న రూ.220 పెరిగింది. అంటే గ్రాముకు రేటు రూ.22 పెరగటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో పెరిగిన రిటైల్ విక్రయ రేట్లు ఇలా భగ్గుమంటున్నాయి..

24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(సెప్టెంబర్ 10న):
హైదరాదాబాదులో రూ.11వేల 051
కరీంనగర్ లో రూ.11వేల 051
ఖమ్మంలో రూ.11వేల 051
నిజామాబాద్ లో రూ.11వేల 051
విజయవాడలో రూ.11వేల 051
కడపలో రూ.11వేల 051
విశాఖలో రూ.11వేల 051
నెల్లూరు రూ.11వేల 051
తిరుపతిలో రూ.11వేల 051

ALSO READ : సామాన్యులకు గుడ్ న్యూస్..

ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు సెప్టెంబర్ 9తో పోల్చితే ఇవాళ అంటే సెప్టెంబర్ 10న.. 10 గ్రాములకు రూ.200 పెరుగుదలను చూసింది. దీంతో బుధవారం రోజున ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. 

22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(సెప్టెంబర్ 10న):
హైదరాదాబాదులో రూ.10వేల 130
కరీంనగర్ లో రూ.10వేల 130
ఖమ్మంలో రూ.10వేల 130
నిజామాబాద్ లో రూ.10వేల 130
విజయవాడలో రూ.10వేల 130
కడపలో రూ.10వేల 130
విశాఖలో రూ.10వేల 130
నెల్లూరు రూ.10వేల 130
తిరుపతిలో రూ.10వేల 130

బంగారం రేట్లతో పాటు మరోపక్క వెండి కూడా తమ ర్యాలీని వారాంతంలో కొనసాగిస్తోంది. సెప్టెంబర్ 10న కేజీకి వెండి రేటు ఎలాంటి మార్పులు లేకుండా.. తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రూ.లక్ష 40వేలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము వెండి రేటు రూ.140 వద్ద విక్రయాలు జరగుతున్నాయి.