
శంషాబాద్, వెలుగు: బంగారాన్ని తరలిస్తున్న ప్యాసింజర్‌ను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. మంగళవారం ఖతార్ రాజధాని దోహ నుంచి శంషాబాద్‌కు చేరుకున్న ఓ ప్యాసింజర్ బంగారం పేస్ట్‌ను తరలిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. 701 గ్రాముల బంగారం పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ. 42 లక్షల 96 వేలు ఉంటుందని అంచనా వేశారు. ప్యాసింజర్‌పై కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.