నాగోల్ కాల్పులు ఘటన భాదితుల్ని పరామర్శించిన సీపీ మహేశ్ భగవత్

నాగోల్ కాల్పులు ఘటన భాదితుల్ని పరామర్శించిన సీపీ మహేశ్ భగవత్

నాగోల్ కాల్పుల్లో గాయపడ్డ వారిని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పరామర్శించారు. ఇద్దరికి సర్జరీ పూర్తి చేసినట్లు సీపీకి వైద్యులు తెలిపారు. బాధితుల నుంచి  మహేష్ భగవత్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెండు బైక్స్ పై నలుగురు వచ్చి…. దోపిడీ చేసి పారిపోయారని చెప్పారు సీపీ. బ్యాగులో మూడు కేజీల బంగారం ఉందని…. ఎంత చోరీ జరిగిందనేది ఇంకా క్లారిటీ రాలేదన్నారు. దొంగలు 4 రౌండ్లు కాల్పులు జరిపారని.. ఇది అంతరాష్ట్ర ముఠాల పనిగా  భావిస్తున్నామన్నారు . స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి దర్యాప్తు చేస్తున్నామని.. సీసీటీవీ విజువల్స్, క్లూస్ సేకరిస్తున్నామన్నారు.

కళ్యాణ్ చౌదరి, సుఖారాం అనే ఇద్దరు వ్యక్తులు బుల్లెట్ గాయాలతో రాత్రి హాస్పిటల్ జాయిన్ అయ్యారని సుప్రజ హాస్పిటల్  మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ కుమార్ చెప్పారు.  సుప్రజ హాస్పిటల్ లో బాధితులిద్దరికీ సర్జరీ చేశామని చెప్పారు. సుఖ్ దేవ్ మెడలోకి బుల్లెట్ దూసుకెళ్లిందని... తెల్లవారుజామున సర్జరీ చేసి బుల్లెట్ బయటకు తీశామని చెప్పారు . మరో 48గంటలపాటు డాక్టర్ల పర్యవేక్షణలో పేషెంట్స్ ఉండాలని చెప్పారు.