Gold Price: రికార్డు స్థాయిలో బంగారం ధరలు

Gold Price: రికార్డు స్థాయిలో బంగారం ధరలు

గత కొద్దిరోజులుగా బంగారంతోపాటు వెండి ధరలు కూడా రికార్డు స్థాయిలో పెరిగాయి. ప్రస్తుతం బంగారం ధర రూ.70 వేల మార్క్ ను దాటేసింది. వెండి రూ. 80 వేల మార్క్ ను దాటేసింది. కొత్త సంవత్సరంలో మరింత పెరిగి అవకాశం ఉందంటున్నారు  ట్రేడర్స్. అదే క్రమంలో మంగళవారం (ఏప్రిల్ 9) కూడా బంగారం, వెండి ధరలు రెండూ పెరిగాయి. 

సోమవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 70,912 ఉండగా.. రూ.190 పెరిగి రూ. 71,102 లకు చేరుకుంది. 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 65,750 చేరింది. మరోవైపు వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. నిన్న రూ. 81,875 ఉన్న వెండి ధర స్వల్పంగా 22 రూపాయలు పెరిగి 81,897 వద్ద రిటైల్ అవుతోంది. 

భారత దేశంలో బంగారం, వెండి ధరలు డాలర్ తో రూపాయి విలువ తో సహా అనేక  అంశాలపై ఆధారపడి ఉంటాయి. విలువైన బంగారం, వెండి ధరలు నిర్ణయించడంలో గ్లోబల్ డిమాండ్ కూడా బంగారం, వెండి ధరలు పెరుగుదలకు కారణమవుతున్నాయి. మంగళవారం నాడు అంతర్జాతీయ మార్కెట్లో  బంగారం ,వెండి ధరలు  పెరిగాయి. గత సెషన్ లో రికార్డు గరిష్ట స్థాయికి చేరాయి.