హైదరాబాద్ నల్లకుంటలో భారీ చోరీ జరిగింది. పెళ్లి రోజు వేడుకలు జరుపుకునేందుకు ఊటీకి వెళ్లి వచ్చేసరికి ఇల్లు లూటీ చేశారు దొంగలు. కాకినాడ ఇంద్రపాలెంకు చెందిన అనుసూరి శివశంకర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. నల్లకుంట తిలక్‌నగర్‌లో భార్యతో కలసి ఉంటున్నాడు. పెళ్లి రోజు వేడుకలు జరుపుకునేందుకు 22న ఊటీకి వెళ్లారు. 24 న ఉదయం కిటికీలు తెరిచి ఉండగా ఇంటి యజమాని ప్రసాద్ అనుమానంతో శివశంకర్‌కు ఫోన్ చేశాడు. 25 ఉదయం ఊటీ నుంచి తిరిగి వచ్చిన శివశంకర్ ఇంట్లోకి వెళ్లి చూసే సరికి బీరువాలో ఉన్న 32 తులాల బంగారు ఆభరణాలతో పాటు కిలో వెండి వస్తువులు కనిపించలేదు. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
