బంగారంపై నో టారిఫ్ అని ట్రంప్ ప్రకటించగానే తగ్గిన గోల్డ్ రేట్లు

బంగారంపై నో టారిఫ్ అని ట్రంప్ ప్రకటించగానే తగ్గిన గోల్డ్ రేట్లు

న్యూఢిల్లీ: బంగారం దిగుమతులపై సుంకాల సస్పెన్స్​కు అమెరికా ముగింపు పలికింది. దీనిపై యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియాలో ఒక ప్రకటన చేశారు. బంగారం దిగుమతులపై ఎలాంటి సుంకాలు విధించబోమని ఆయన స్పష్టం చేశారు. వైట్ హౌస్ నుంచి మాత్రం అధికారిక ప్రకటన రాలేదు. 

గత వారం రోజులుగా బంగారం దిగుమతులపై సుంకాలు విధిస్తారనే గందరగోళం నెలకొంది. ట్రంప్​ వివరణ అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరల పతనానికి దారితీసింది. ఢిల్లీలోనూ దీని ధర మంగళవారం రూ. వెయ్యి తగ్గి 10 గ్రాముల ధర రూ. 1,01,520కి చేరింది.  వెండి ధర కిలోకు రూ. 2,000 తగ్గి రూ. 1,12,000కి  చేరింది. సోమవారం ఇది కిలోకు రూ. 1,14,000 వద్ద ముగిసింది.