శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో రూ. రెండున్నర కోట్ల బంగారం సీజ్..

శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో రూ. రెండున్నర కోట్ల బంగారం సీజ్..

తులం బంగారం లక్షలు కురిపిస్తన్న సందర్భంగా.. అక్రమంగా ఇండియాకు తరలిస్తూ శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో పట్టుబడ్డారు ఇంటర్నేషనల్ స్మగర్లు. గురువారం (అక్టోబర్ 16) సుమారు రెండున్నర కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. 

డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటలిజెన్స్ డిపార్ట్మెంట్- ( DRI) అందిన సమాచారం మేరకు ఎయిర్ పోర్ట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కువైట్ నుంచి షార్జా మీదుగా ఎయిర్ అరేబియా ఫ్లైట్ లో వచ్చిన ప్రయానికుడి నుంచి భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు అధికారులు. 

ప్రయాణికుడి నుంచి 24 క్యారెట్ల విలువైన 5 బంగారు  బిస్కెట్స్, రెండు కట్ పీసులను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మొత్తం 1.798  కిలోలు ఉన్న బంగారం విలువ 2 కోట్ల 37 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. 

అధికారులకు డౌట్ రాకుండా జాగ్రత్త పడ్డాడు స్మగ్లర్. లగేజీ డోర్ మెటాలిక్ లాక్‌ కొంత బంగారం దాచాడు .అదేవిధంగా సన్‌ఫ్లవర్ సీడ్స్ (పొద్దు తిరుగుడు గింజలు) ఉన్న ప్లాస్టిక్ పౌచ్‌లో దాచి ఉంచాడు.