15 కేజీల బంగారం పట్టివేత.. ఇద్దరు స్మగ్లర్లు అరెస్ట్

15 కేజీల బంగారం పట్టివేత.. ఇద్దరు స్మగ్లర్లు అరెస్ట్

పశ్చిమ బెంగాల్‌లో భారీగా బంగారం పట్టుబడింది.  భారత్‌ - బంగ్లాదేశ్ సరిహద్దులోని ఓ గ్రామం సమీపంలో సరిహద్దు భద్రతా దళం(BSF), డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఇంటెలిజెన్స్‌ (DRI) అధికారులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో 106 బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు.. దీనికి సంబంధించి ఇంటి యజమాని సహా ఇద్దరిని అరెస్టు చేసినట్లు బీఎస్ఎఫ్ తెలిపింది. 

బంగారం బిస్కెట్ల బరువు దాదాపు 15 కిలోలు ఉండగా.. దీని ధర రూ.8.5 కోట్లు ఉంటుందని అంచనా.  మసూద్, నసీఫ్ అనే ఇద్దరు బంగ్లాదేశ్ జాతీయుల నుంచి బంగారు బిస్కెట్లను తీసుకున్నట్లు అరెస్టైన వ్యక్తులిద్దరూ విచారణలో వెల్లడించారు. అయితే స్మగ్లర్ల వద్ద దొరికి బంగారం నదియా డయాట్రియూట్‌లో నివాసం ఉండే సంతోష్ హల్దార్‌కు అప్పగించాల్సి ఉంది. 

ALSO READ : ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్న హిందూ అబ్బాయి : పోలీసుల విచారణ

అయితే, ఆ ప్రాంతంలో బీఎస్‌ఎఫ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండటంతో బంగారాన్ని నిందితులు ఓ ఇంట్లో చెత్త బుట్టలో దాచారు. పట్టుబడిన బంగారంతో పాటు స్మగ్లర్లను తదుపరి చట్టపరమైన చర్యల కోసం  డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఇంటెలిజెన్స్‌ బృందానికి అప్పగించారు .