
ఫొటో చూశారా? గోల్డ్ టాయిలెట్ సీటు ఇది. పేరు అమెరికా. 18 క్యారెట్ల బంగారంతో చేశారు. జనాలు వాడుకోవడానికని బ్రిటన్‌లోని బ్లెన్‌హెయిమ్ ప్యాలెస్‌లో గురువారమే అందుబాటులో ఉంచారు. ముందే బుక్ చేసుకోవాలని నిబంధన పెట్టారు. జనాలు ఎక్కువగావస్తుండటంతో ఒక్కొక్కరికి మూడు నిమిషాల టైం కూడా పెట్టారు. బంగారమంటే దొంగలు ఊరుకుంటారా మరి. ఇదే టైం అనుకొని శుక్రవారం రాత్రి టాయిలెట్ సీట్‌ను విరగ్గొట్టి ఎత్తుకెళ్లారు. 2016లో ఆర్టిస్టు మౌరిజియో దీన్ని తయారు చేశారు. ఇంతకీ ఈ టాయిలెట్ సీటు రేటెంతో తెలుసా? 8 కోట్ల 80 లక్షల రూపాయలు.