భద్రాచలం సీతా రామయ్యకు సువర్ణ తులసీదళ అర్చన

భద్రాచలం సీతా రామయ్యకు సువర్ణ తులసీదళ అర్చన

భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామికి శనివారం సువర్ణ తులసీదళాలతో గర్భగుడిలో అర్చన జరిగింది. రామపాదుకలను భద్రుడి మండపానికి తీసుకెళ్లి పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం గర్భగుడిలో మూలవరులను అలంకరణ చేసి, విశేష హారతులు ఇచ్చి, బంగారు తులసీ దళాలతో అర్చన నిర్వహించారు. 

కల్యాణమూర్తులను ఊరేగింపుగా బేడా మండపానికి తీసుకెళ్లి నిత్య కల్యాణం చేశారు. 143 జంటలు కంకణాలు ధరించి ఈ క్రతువులో భక్తిప్రవత్తులతో పాల్గొన్నారు. వీకెండ్, వరుస సెలవులు కావడంతో భక్తులతో ఆలయం కిటకిటలాడింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈవో దామోదర్​రావు క్యూలైన్లలో మజ్జిగ పంపిణీ, తాగునీటి వసతిని పెంచారు.