మద్యం అమ్ముతున్న ఇద్దరు అరెస్ట్ .. 150 బాటిల్స్ స్వాధీనం

మద్యం అమ్ముతున్న ఇద్దరు అరెస్ట్ .. 150 బాటిల్స్ స్వాధీనం

మెహిదీపట్నం, వెలుగు:  బార్ సెట్టింగ్ చేసి మద్యం అమ్ముతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన గోల్కొండ పీఎస్ పరిధిలో జరిగింది. సౌత్ అండ్ వెస్ట్ జోన్ అదనపు డీసీపీ అశ్వక్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గోల్కొండ బంజారా దర్వాజా ప్రభుత్వ రేషన్ షాప్ పక్కన సందీప్ సింగ్, తల్లి శోభ ఇద్దరు కలిసి వివిధ రకాల  మద్యం సీసాలు అమ్ముతున్నారు.

  సమాచారం అందడంతో పోలీసులు దాడి చేసి వారి వద్ద 150 మద్యం బాటిల్స్  స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. అయితే ఇన్ని రోజులుగా  మద్యం అమ్ముతున్న సంఘటన స్థానిక పోలీసులకు తెలియదా.. అని స్థానికులు విమర్శించారు.