
సీఎం కేసీఆర్ పై తెలంగాణ కురుమ యువ చైతన్య సమితి( KYCS) నేతలు మండిపడ్డారు. 14 శాతం ఉన్న కురుమలకు ఒక్క టికెట్ ఇవ్వకపోవడంపై ప్రశ్నించారు. ఇప్పటికైనా కురుమలు ఎక్కువగా ఉన్న 12 అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జనగాం, మక్తల్, వేములవాడ ,ఆలేరు, నాగర్ కర్నూల్ ,ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్,సనత్ నగర్, నారాయణపేట, కొడంగల్ ,పటాన్ చెరు, గద్వాల్ అసెంబ్లీ టికెట్లతో పాటు 4 ఎంపీ టికెట్లు ఇవ్వాలని అన్ని బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లను డిమాండ్ చేశారు
ఏ పార్టీ కురుమలను గుర్తించి ఎక్కువ అసెంబ్లీ టికెట్ కేటాయిస్తుందో.. ఆ పార్టీకి కురుమల మద్దతు ఉంటుందన్నారు కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు గొరిగే నరసింహ కురుమ. టికెట్ ఇవ్వని పార్టీలను భూస్థాపితం చేస్తామని KYCS నాయకులు హెచ్చరించారు