కొడుకు పుట్టిన ఆనందంలో డ్యూటీ కోసం వేల కిలోమీటర్లు వెళ్లి..

కొడుకు పుట్టిన ఆనందంలో డ్యూటీ కోసం వేల కిలోమీటర్లు వెళ్లి..

యాదాద్రి భువనగిరి: పాపం ఆ జంటకు కొడుకు పుట్టిన ఆనందం కొద్ది రోజుల్లోనే ఆవిరైపోయింది. డ్యూటీలో భాగంగా వేల కిలోమీటర్లు వెళ్లిన భర్త తిరిగిరాని అనంతలోకాలకు వెళ్లాడని తెలిసి కుప్పకూలిపోయింది. అసోం రాష్ట్రంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మల్లాపురం గ్రామ వాసి ఐలయ్య (36) కన్నుమూశాడు. బోరు బండి డ్రైవర్ గా పనిచేస్తున్న ఐలయ్యకు కొద్ది రోజుల క్రితం కొడుకు పుట్టాడు. అంతకుముందు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మూడో కాన్పులో బాబు పుట్టడంతో వీరి కుటుంబంలో ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ప్రతిరోజు పండగే అన్నట్లు సంబరంగా గడిపారు.  ఇద్దరు పాపలు, ఒక బాబుతో మా కుటుంబమంతా సంతోషంగా జీవిస్తామని అందరూ ఆనందంగా ఉన్నారు. ఈ ఆనంద క్షణాలను ఆస్వాదిస్తూనే  డ్యూటీలో భాగంగా కొద్ది రోజుల క్రితం అసోం రాష్ట్రానికి వెళ్లాడు. ఉదయమే ఫోన్ చేసి భార్య పిల్లలతో మాట్లాడాడు. అందరి గురించి కూడా ఆరా తీశాడు. తర్వాత ఏదో పని ఉందని బైకుపై వెళ్తుండగా కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఐలయ్యను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స ఫలించలేదు. కొద్దిసేపటికే ఐలయ్య కన్నుమూశాడు. తన భర్త నుంచి రోటీన్ ఫోన్ కోసం ఎదురు చూస్తున్న భార్యా పిల్లలు మరణవార్త విని కుప్పకూలిపోయారు. కంటతడిపెట్టుకుని బోరున విలపించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

For More News..

2937 కోట్లతో టీటీడీ బడ్జెట్.. ఏప్రిల్ 14 నుంచి శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి

కాణిపాకం టెంపుల్‌కు 7కోట్లు విరాళమిచ్చిన అజ్ఞాత భక్తుడు

ఏపీ సచివాలయం వద్ద దంపతుల ఆత్మహత్యాయత్నం

క్లాస్ రూమ్‌లో లేడీ టీచర్ పై కత్తితో దాడి