ఏసుక్రీస్తు త్యాగం విశ్వమానవాళికి మార్గదర్శకం

ఏసుక్రీస్తు త్యాగం విశ్వమానవాళికి మార్గదర్శకం

సూర్యాపేట, వెలుగు : సర్వ మానవాళి పాప విమోచన కోసం తన ప్రాణాలను బలిదానంగా అర్పించిన కరుణామయుడు ఏసుక్రీస్తు అని, ఆయన ప్రాణత్యాగం విశ్వశాంతికి చిహ్నమని ఆర్సీఎం చర్చి ఫాదర్ రెవరెండ్ కస్పారెడ్డి తెలిపారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నిర్మల చర్చి ఆధ్వర్యంలో ‘పరిశుద్ధ శిలువ మార్గం’ కార్యక్రమాన్ని నాటక రూపంలో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ యాత్ర అంబేద్కర్ విగ్రహం, శంకర్ విలాస్, గాంధీ బొమ్మ మీదుగా నిర్మల హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లోని కల్వరి కొండ వరకు కొనసాగింది.

ఈ సందర్భంగా ఫాదర్ మాట్లాడుతూ ఏసుక్రీస్తు చూపిన త్యాగం, క్షమాగుణం, నిస్వార్థ ప్రేమ ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని, శత్రువులను సైతం ప్రేమించాలన్న ఆయన సందేశం సమాజంలో శాంతి, సోదరభావం పెంపొందించడానికి దోహదపడుతుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ మెంబర్లు ముక్కాల మర్రి రెడ్డి, వలమల్ల బాలస్వామి, బంధ శాంసన్, నాగటి ఏసుదాస్, సిస్టర్స్, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే 

సంగారెడ్డి టౌన్, వెలుగు: సంగారెడ్డి జిల్లాకేంద్రంలోని రాక్ చర్చిలో శుక్రవారం భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే నిర్వహించారు. ఈ సందర్భంగా వందలాది క్రైస్తవులు చర్చికి చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చిన్నపిల్లల నృత్యాలు అలరించాయి.