కరోనా రిజల్ట్ 30 సెకన్లలో : కొత్త టెస్ట్ కిట్ను తయారు చేయనున్న ఇండియా- ఇజ్రాయెల్

కరోనా రిజల్ట్ 30 సెకన్లలో : కొత్త టెస్ట్ కిట్ను తయారు చేయనున్న ఇండియా- ఇజ్రాయెల్

మన దేశంలో ఫైనల్ స్టేజ్ ట్రయల్స్ .. ఇక్కడే తయారీ మాట తీరు, శ్వాసలోని తేడాలతోనే మహమ్మా రి గుర్తింపు ఏఐ, మెషీన్ లెర్నింగ్ టెక్నాలజీతో వైరస్ మూలాల వెల్లడి. అరగంటలోపే రిజల్ట్​ ఇచ్చే మరో రెండు కెమికల్ టెస్టు లూ అందులోనే అతి త్వరలోనే స్పె షల్ ఫ్లైట్ లో ఇండియాకు ఇజ్రాయెల్ రీసెర్చర్లు అందులోనే వెంటిలేటర్లు పంపనున్న ఆ దేశ ప్రధాని నెతన్యాహూ..

శాంపిల్ అక్కర్లేదు.. మన మాట, శ్వాసే శాంపిల్ . కెమికల్స్​తో పనే ఉండదు.. టెక్నాలజీనే ఫార్ములా. మాటతో వైరస్ గుట్టు.. శ్వాసతో దాని మూలాలు బయటపడిపోతాయి. దానికి రోజులు పట్టదు.. గంటల సేపు ఆగాల్సిన పని లేదు.. నిమిషాలూ కాదు.. జస్ట్​ 30 సెకన్లే చాలు! ఇదో కొత్త టెస్ట్​. మన దేశంలో మనకు అతిత్వరలోనే అందబోతున్న కరోనా టెస్ట్​. ఇండియాతో కలిసి ఇజ్రాయెల్ తయారు చేస్తున్న సరికొత్త టెస్ట్​. ఆ టెస్టు సంగతులేందో ఓ సారి లుక్కేయండి మరి!

న్యూఢిల్లీ: ఆర్టీపీసీఆర్ .. ప్రస్తుతం కరోనా టెస్టింగ్ కు ఎక్కువగాఎక్కువగా వాడుతున్న కిట్లివి. రిజల్ట్​ రావడానికి 4 నుంచి 8 గంటలు పడుతుంది. ఆ రిజల్ట్​ మనకు తెలియడానికి రెం డు నుంచి మూడు రోజులవుతోంది. తర్వాత యాంటీజెన్ టెస్టులొచ్చాయి. అరగంటలోనే రిజల్ట్​. హమ్మయ్య.. అనుకుంటున్నాం . కానీ, అర నిమిషంలోనే రిజల్ట్​ ఇచ్చే టెస్ట్​ కిట్ ను ఇండియా తో కలిసి తయారు చేయబోతోంది ఇజ్రాయెల్ . ఇండియాలోనే వాటిపై ట్రయల్స్ చేసి..ఇండియాలోనే వాటిని తయారు చేసి ప్రపంచ దేశాలకూ అందించబోతున్నాయి. దీనిపై ఇజ్రాయెల్ రక్షణ శాఖ, విదేశాంగ శాఖ అధికారిక ప్రకటననూ చేశాయి. దీని ధర జస్ట్​ 10 డాలర్లే. అంటే మన కరెన్సీలో దాదాపు 750 రూపాయలు.

టెక్నాలజీనే ఫార్ములా

ఇప్పటి దాకా కరోనా టెస్ట్​ ఎలాంటిదైనా కెమికల్స్ సాయంతోనే వైరస్ ను గుర్తిస్తున్నారు. ఆర్టీపీసీఆర్ తో వైరస్ జీనోమ్ ను గుర్తిస్తే.. యాంటీజెన్ టెస్టులతో వైరస్ ప్రొటీన్లను కనిపెడుతున్నారు. నోరు లేదా ముక్కు నుంచి శాంపిల్ తీసుకుంటున్నా రు. కానీ, ఈ కొత్త టెస్ట్​ కిట్ కు టెక్నాలజీనే పెద్ద ఫార్ములా . మన శ్వాసే టెస్ట్ శాంపిల్ . అవును, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నిం గ్ టెక్నాలజీలతో మన ఒంట్లో ఉన్న కరోనా వైరస్ ను ఈ కిట్ పసిగడుతుంది. మన శ్వాసను టెస్ట్​ చేసి వైరస్ మూలాలను చెప్పేస్తుంది. 85 శాతం కచ్చి తత్వం తో టెస్ట్​ కిట్ రిజల్ట్​ ఇస్తుందని ఇజ్రాయెల్ చెబుతోంది.

ఎవరు తయారు చేస్తరు ?

ఇజ్రాయెల్ డైరక్టరేట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్​ అండ్ డెవలప్మెంట్ (డీడీఆర్ డీ)నే ఈ కొత్త టెస్ట్​ను తయారు చేసింది. మన దేశానికి చెందిన డిఫెన్స్ రీసెర్చ్​ అండ్ డెవలప్ మెం ట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) తో కలిసి మన దగ్గర ఈ టెస్ట్​ కిట్లపై ఫైనల్ స్టేజ్ ట్రయల్స్ చేయనున్నా రు. ఆ ట్రయల్స్ ను ప్రధాని నరేంద్రమోడీకి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ (పీఎస్ ఏ) అయిన డాక్టర్ కె. విజయరాఘవన్ పర్యవేక్షిస్తారు. దాదాపు రెండు వారాల పాటు ట్రయల్స్ నడుస్తాయి. ఆ ట్రయల్స్ సక్సెస్ అయితే.. వెంటనే ఇక్కడ రెగ్యులేటరీ పర్మిష న్ తీసుకుని ఇక్కడే వాటిని పెద్ద సంఖ్యలో తయారు చేస్తారు. మన అవసరాలకు పోనూ మిగతా వాటిని ప్రపంచ దేశాలకు పంపిస్తారు.

స్పెష ల్ ఫ్లైట్ లో ఇండియాకు టీం

ఇప్పటికే ఇజ్రాయెల్ లో చేసిన ట్రయల్స్ లో టెస్ట్​ కిట్ సక్సెస్ అయింది. ఇండియా లో ట్రయల్స్ కోసం కొద్ది రోజుల్లోనే ఇజ్రాయెల్ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో రీసెర్చ్​ టీం ఇండియా కు రాబోతోంది. ఆ దేశ రక్షణ శాఖ, విదేశాంగ శాఖ, ఆరోగ్య శాఖకు చెందిన నిపుణులతోపాటు తయారీ బాధ్యతలు తీసుకున్న కంపెనీల ప్రతినిధులూ ట్రయల్స్ కోసం ఇక్కడికి వస్తారు. డీడీఆర్ &డీ టీమ్ ట్రయల్స్ చేస్తుంది. ఆ టెస్ట్​ కిట్లను పాలిమరేజ్ చెయిన్ రియాక్షన్ (పీసీఆర్ )తో వ్యాలిడేట్ చేశాకే టెస్టులకు అనుమతిస్తారు.

వెయ్యి మందిపై సక్సెస్

ఇజ్రాయెల్ లో ఇప్పటికే వెయ్యి మంది పేషెంట్లపై ఈ టెస్ట్​కిట్ లోని బ్రెతలైజర్ పద్ధతిలో టెస్ట్​ చేశారు. 85 శాతం కచ్చి తత్వంతో రిజల్ట్స్ వచ్చాయని ఆ కిట్ ను తయారుచేస్తున్న నానోసెంట్ కంపెనీ సీఈవో ఒరెన్ గావ్రియెలీ చెప్పారు. వాసన, వాసన ప్యాటర్న్​ల ఆధారంగా టెస్ట్​ ఉంటుందన్నారు. బ్రెతలైజర్ టెస్టులో పాజిటివ్​ వస్తే.. కన్ఫర్మేష న్ కోసం ల్యాబ్ టెస్ట్​కు పంపుతామన్నారు. కాగా, ఇండియా కు వచ్చే స్పెష ల్ ఫ్లైట్ లోనే వెంటిలేటర్లు, ఇతర సాయాన్ని ఇజ్రాయెల్ పంపుతోంది. ఇజ్రాయెల్ కు హైడ్రాక్సీక్లో రోక్విన్ ను ఇచ్చేం దుకు ప్రధాని మోడీ.. ఎక్స్ పోర్స్ట్ పై పెట్టిన ఆంక్షలు ఎత్తేసినందునే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ కూడా ఆంక్షలను ఎత్తేసి వాటిని పంపిస్తున్నారని ఆ దేశ విదేశాంగ మంత్రి చెప్పారు.

టెస్ట్నాలుగు రకాలు

ఈమధ్య ప్రతిదాంట్లో నూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే కీలక పాత్ర ఉంటోంది. హ్యాం డ్ శానిటైజర్లను డిస్పె న్స్ చేయడం దగ్గర్నుంచి .. మన టెంపరేచర్ ను చెక్ చేసే వరకు ఏఐ రోల్ ఉంటోంది. ఇప్పుడు ఈ కొత్త కరోనా టెస్ట్​లోనూ దానిదే పైచేయి. ఈ టెస్ట్​లో నాలుగు రకాలున్నాయి.

బ్రెతలైజర్ టెస్ట్​

మామూలుగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా బ్రెత్ అనలైజర్ టెస్టు లు చేస్తారన్న సంగతి తెలిసిందే కదా. ఈ టెస్ట్​లోనూ అంతే. డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్​లో అయితే నోటితో గాలిని ఊదాలి. కానీ, ఇక్కడ మాత్రం ముక్కు తో ఊదాలి. టెస్ట్​లో భాగంగా గాలిని ఊదేందుకు వీలుగా ఉండే ఓ కవర్ బ్యాగును ఇస్తారు. పైభాగంలో ఉండే గొట్టాన్ని ముక్కు లో పెట్టు కుని.. ఇంకో ముక్కు రంధ్రాన్ని మూసి గాలిని పీల్చి వదలాలి. తర్వాత ఆ గాలిని ఏఐ టెక్నాలజీ ఉండే ‘సెంట్ రీడర్ ’ అనే ఓ మెషీన్ లోకి పంపిస్తా రు. ఆ మెషీన్ .. టెర్రాహెర్ట్జ్ వేవ్స్ (టీహెచ్ జెడ్ ) అనే టెక్నాలజీ సాయంతో వైరస్ ను అర నిమిషంలోనే గుర్తిస్తుంది. వాయిస్ టెస్ట్, బ్రెతలైజర్ టెస్ట్​, ఐసోథెర్మల్ టెస్టింగ్ , పాలిఅమైనో యాసిడ్ టెస్టింగ్.

వాయిస్ టెస్ట్​

వాయిస్ టెస్ట్​లో భాగంగా మన మాటలను ఏఐ రికార్డ్ చేస్తుం ది. మాటలో తేడాలను బట్టి మన శ్వాస వ్యవస్థ ఎలా ఉందో పసిగడుతుంది. కొంచెం తేడా ఉన్నా.. శ్వాస వ్యవస్థకు డ్యామేజ్ అయినట్టు అనిపిం చినా వెంటనే అలర్ట్​ చేస్తుంది. 30 సెకన్లలోనే రిజల్ట్​ వస్తుంది.

పాలి అమైనో యా సిడ్స్టెస్ట్

​ఈ పద్ధతిలోనూ కెమికల్స్ కావాల్సి ఉంటుంది. ఉమ్మి శాంపిల్ లోని వైరస్ ప్రొటీన్లను ఈ పద్ధతిలో గుర్తిస్తారు. ఈ పద్ధతిలోనూ జస్ట్​ కొన్ని నిమిషాల్లో నే రిజల్ట్​ వస్తుంది.

ఐసోథెర్మల్ టెస్టింగ్

ఈ రకం టెస్టు లో కెమికల్స్ ను వాడతారు. ఉమ్మిని శాంపిల్ గా తీసుకుంటారు. ఆ శాంపిల్ ను ఓ కెమికల్ లో కలిపి 60 డిగ్రీల వద్ద వేడి చేస్తా రు. ఆ రియాక్షన్ లో వైరస్ ఉన్నదీ లేనిదీ తెలిసిపోతుంది. ఈ పద్ధతిలో అరగంటలోపే రిజల్ట్​ వస్తుం ది. ఇంటి వద్ద కూడా టెస్ట్​ చేసుకోవచ్చు.

లక్షల కొద్దీ టెస్టులు చేయొచ్చు

‘‘ఈ కిట్లతో క్షణాల్లోనే కరోనాను గుర్తిం చొచ్చు. ఇండియా సహకారంతో టెక్నాలజీని అభివృద్ధి చేస్తాం. 10 రోజుల్లో లక్షల కొద్దీ టెస్ట్​ చేయొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్​తో కంప్యూటర్ ద్వారా వైరస్ ను గుర్తిం చొచ్చు. దీ నికి పట్టే టైం చాలా తక్కువ. పీసీఆర్ టెస్టులతో ఈ కిట్లన్నింటినీ వ్యాలిడేట్ చేస్తాం . ఆ తర్వాతే టెస్టిం గ్ చేస్తాం ’’

గబీ యా ష్కెన్జాయ్ , ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి

బంధం మరింత బలం

‘‘జనానికి సైంటిఫిక్ , టెక్నాలజీ ఫలాలు అందించేందుకు ఇండియా, ఇజ్రాయెల్  సహకరించు కుంటున్నా యి. ప్రపంచ దేశాలకు ఇదో మంచి ఉదాహరణ. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక బంధాలను మరింత పటిష్టం చేస్తుంది. ఇండియాకు వచ్చే ఫ్లైట్లలో కరోనాతో పోరాడేందుకువెంటిలేటర్లు సహా కొన్ని టెక్నాలజీలనూ పంపిస్తున్నారు . ’’

– సంజీవ్​ సింగ్లా , ఇజ్రాయెల్ లో ఇండియా అంబాసిడర్.