మూవీ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. రూ.99కే మ‌ల్టీప్లెక్స్‌ సినిమా టికెట్

మూవీ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. రూ.99కే మ‌ల్టీప్లెక్స్‌ సినిమా టికెట్

సినిమా ల‌వ‌ర్స్‌కు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. ఈ నెల 31న సినిమా లవర్స్ డే సందర్భంగా కేవ‌లం 99 రూపాయలకే మ‌ల్టీప్లెక్స్‌లో సినిమా చూడొచ్చని తెలిపింది. పీవీఆర్, ఐనాక్స్, మిరేజ్, ఏషియన్, సినీపోలిస్ లాంటి చైన్లతో పాటు దేశ‌వ్యాప్తంగా ఉన్న 4 వేలకుపైగా స్క్రీన్లలో మే 31న ఇదే టికెట్ ధర అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. అంటే, ఆరోజు ఏ భాష సినిమా అయినా, ఏ షో అయినా ప్రేక్షకులు రూ. 99కే చూడొచ్చన్నమాట. 

వాస్తవానికి సాధారణ థియోటర్లలో టికెట్ ధర రూ.50 నుంచి రూ.200లోపు ఉంటే.. మల్టీప్లెక్స్‌లలో ఆ రేటు కాస్త ఎక్కువే. టాక్స్‌లన్నీ కలిపి రూ.250 నుంచి రూ.300 వరకూ ఉంటుంది. అంత ధర పెట్టి కుటుంబసమేతంగా సినిమా చూడలంటే సామాన్యులకు కష్టమే. ఆ రేట్లను చూసే వెన‌క‌డుగు వేస్తుంటారు. ఇప్పుడు అలాంటి వారందరూ సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల టిక్కెట్ రేట్ల కంటే త‌క్కువ‌ ధ‌ర‌తోనే  మ‌ల్టీప్లెక్స్‌లో సినిమా చూసే అవకాశం దక్కింది.

Also read :Weather update: ఉత్తరాదిన మండుతున్న సూర్యుడు... రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ 

 

జిఎస్‌టీ, కన్వీనియన్స్ ఫీజు తప్పించండిలా..

బుక్‌మైషో, పేటీఎం వంటి ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లలో సినిమా టిక్కెట్లు బుక్‌ చేసుకునే వారు టికెట్ ధర రూ.99తోపాటు జిఎస్‌టీ, కన్వీనియన్స్‌ ఫీజు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇది గుర్తుంచుకోగలరు. అదే థియేటర్‌ కౌంటర్‌ల వద్ద కొనుగోలు చేస్తే ఈ చార్జీలు వర్తించవు. కేవలం రూ.99కే టికెట్‌ పొందవచ్చు. టాక్స్‌లు తప్పించాలనుకుంటే కౌంటర్ల వద్ద కొనుగోలు చేయడం ఉత్తమం. ఇంకెందుకు ఆలస్యం వెంటనే టికెట్లు బుక్ చేసుకొని మూవీ మజాను ఆస్వాదించండి.