EPSపెన్షనర్స్కు గుడ్న్యూస్..మీరు ఇకపై ఏ బ్యాంకు నుంచైనా, ఏ బ్రాంచి నుంచైనా..దేశంలో ఎక్కడైనా మీ పెన్షన్లను పొందవచ్చు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గ నైజేషన్ (EPFO)నేతృత్వంలో నడుస్తున్న ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్(EPS) పెన్షన్దారులు పెన్షన్లను డ్రా చేసుకోవడం సులభతరం చేసే క్రమంలో కేంద్రప్రభుత్వం సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్స్ సిస్టమ్ ను తీసుకొచ్చింది.. ఈ స్కీం 2025 జనవరి నుంచి అమలులోకి వస్తుంది.
Union Minister Dr. Mansukh Mandaviya approves Centralized Pension Payments System (CPPS) for pension under EPS 1995; more than 78 Lakh EPS pensioners to be benefitted. He says, "EPS Pensioners to get pension from any bank, any branch, anywhere in India from 1st January 2025.":… pic.twitter.com/2HoqtDB8WE
— ANI (@ANI) September 4, 2024
పెన్షనర్ ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి మారినప్పుడు లేదా అతని బ్యాంక్ లేదా బ్రాంచ్‌ని మార్చినప్పుడు కూడా పెన్షన్ చెల్లింపు ఆర్డర్‌లను (PPO) ఒక కార్యాల యం నుంచి మరొక కార్యాలయానికి బదిలీ చేయవలసిన అవసరం లేకుండా భారతదేశం అంతటా ఎక్కడైనా తమ పెన్షన్ పొందే అవకాశం CPPS కల్పిస్తుంది.
78 लाख EPS पेंशनर्स के लाभार्थियों के हित में एक महत्वपूर्ण निर्णय लिया गया है। जल्द ही EPS पेंशनर्स सेंट्रल पेंशन पेमेंट्स स्कीम (CPPS) के तहत देशभर के विभिन्न बैंकों की किसी भी शाखा से अपनी पेंशन राशि प्राप्त कर सकेंगे।
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) September 4, 2024
प्रधानमंत्री श्री @narendramodi जी के निरंतर प्रयासों से…
కొత్త విధానం ద్వారా పింఛనుదారులు తమ పెన్షన్ ప్రారంభంలో వెరిఫికేషన్ కోసం బ్యాంకు శాఖలను సందర్శించాల్సిన అవసరం ఉండదు. చెల్లింపులు విడుదలైన వెంటనే జమ చేయబడతాయి. ఈ మార్పుతో EPFO పెన్షన్ పంపిణీలో గణనీయమైన ఖర్చును కూడా తగ్గిస్తుంది.