మూవీ లవర్స్కు గుడ్ న్యూస్.. ఇక నుంచి 5 షోలు.. రోజుకో లో బడ్జెట్ మూవీ.. కొత్త రేట్లు ఖరారు

మూవీ లవర్స్కు గుడ్ న్యూస్.. ఇక నుంచి 5 షోలు.. రోజుకో లో బడ్జెట్ మూవీ.. కొత్త రేట్లు ఖరారు
  • బడ్జెట్ 100 కోట్లు దాటితే టికెట్ రేట్లు పెంచుకోవచ్చు
  • రేటు పెంచితే వెల్ఫేర్​కు రూ. కోటి డిపాజిట్
  • రిలీజైన తొలి 10 రోజుల వరకే పెంచిన రేట్లు అమలు
  • ప్రతి థియేటర్‌‌‌‌లో 25%  సీట్లు నాన్‌‌‌‌ -ప్రీమియం
  • 7.1 సౌండ్, 2కే/4కే స్క్రీన్లకు స్పెషల్ థియేటర్స్‌‌‌‌ కేటగిరీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సినిమా టికెట్ల రేట్లను ప్రభుత్వం ఖరారు చేసింది. ఏసీ, నాన్ -ఏసీ, స్పెషల్ థియేటర్లు, మల్టీప్లెక్స్‌‌‌‌లలో టికెట్ల ధరలను నిర్ణయించింది. మొత్తం థియేటర్లను నాలుగు కేటగిరీలుగా డివైడ్ చేసి టికెట్ల రేట్లను ఖరారు చేసింది. వీటితో పాటు ఉదయం 8 నుంచి రాత్రి 1 గంట వరకు 5 షోలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. చిన్న సినిమాలకు రోజుకు ఒక షో తప్పనిసరి చేసింది. ఈ మేరకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్ బుధవారం జీవో  77ను విడుదల చేశారు.

ఃఉత్తర్వు ప్రకారం..సినిమా రిలీజైన తొలి 10 రోజులు టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. రూ. 100 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ ఉన్న మూవీలకు 'సూపర్ హై బడ్జెట్' హోదాను కల్పించింది. స్పెషల్ థియేటర్స్ 
కేటగిరీలో ఏ హాల్స్ వస్తాయి? ఏ వసతులు ఉన్న హాల్స్ స్పెషల్ కేటగిరీలోకి వస్తాయన్న వివరాలను జీవోలో ప్రభుత్వం పేర్కొంది.

సింగిల్, ఏసీ హాల్స్‌‌‌‌లో డిజిటల్, డాల్బీ, ఐమ్యాక్స్, లార్జ్ స్క్రీన్, 75 ఫీట్ల కంటే ఎక్కువ ఉన్న హాల్స్ స్పెషల్ కేటగిరీ కిందకు వస్తాయని స్ప ష్టం చేసింది. ఏసీ, నాన్-ఏసీ, స్పెషల్ థియేటర్స్, మల్టీప్లెక్స్ - ఏ హాల్‌‌‌‌ అయినా 25 శాతం సీట్లను నాన్-ప్రీమియం కేటగిరీ కింద రిజర్వ్ చేయాలని ప్రభుత్వం తెలిపింది. ఈ 25 % సీట్లను హాల్‌‌‌‌లో ఉన్న మొత్తం సీట్ల ప్రకారం లెక్కకట్టాలని పేర్కొంది. 

నాన్ ఏసీ థియేటర్స్

    నాన్ ప్రీమియం    ప్రీమియం
మినిమం      30    50
మ్యాగ్జిమం    70    100
ఏసీ
మినిమం    50    100
మ్యాగ్జిమం    150    200
స్పెషల్ థియేటర్స్
మినిమం    100    200
మ్యాగ్జిమం     250    300
మల్టిప్లెక్స్
మినిమం    100    200
మ్యాగ్జిమం    250    300