వెలుగు ఓపెన్ పేజీ.. సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్ మంజూరు ఆలస్యం చేయొద్దు

వెలుగు ఓపెన్ పేజీ.. సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్ మంజూరు ఆలస్యం చేయొద్దు

ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్) అనేది ఆపదలో ఉన్నవారికి ముఖ్యంగా వైద్య ఖర్చులు,  ప్రకృతి వైపరీత్యాలు, లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఆర్థికసాయం అందించడానికి ఏర్పాటు చేసిన పథకం. అయితే,  సీఎం రిలీఫ్ ఫండ్  చెక్కుల విడుదలలో కొంత ఆలస్యం అవుతోంది.  

నిరుపేదలు అత్యవసర సమయంలో తమ ప్రాణాలను నిలుపుకోవడానికి తప్పని పరిస్థితుల్లో  కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటారు. ఈ విధంగా చికిత్స పొందినవారికి భరోసాగా ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్​) ద్వారా,  వెచ్చించిన ఖర్చులో  కొంత మొత్తాన్ని వైద్యం పొందిన కుటుంబానికి  ప్రభుత్వం అందిస్తున్నది. ఎమ్మెల్యే,  ఎమ్మెల్సీ,  ఎంపీ  సిఫారసుతో  దరఖాస్తు చేసుకొని  నెలలు, నెలలు గడుస్తున్నా..  పేదలకు  సహాయం  అందాల్సిన సమయానికి అందడంలేదు.  

సీఎం రిలీఫ్ ఫండ్ కోసం పేదల పాట్లు

అత్యవసర  సమయంలో  వడ్డీ వ్యాపారులను  ఆశ్రయించి అప్పుచేసి  కార్పొరేట్ ఆసుపత్రుల్లో  వైద్యం చేయించుకున్న పేద కుటుంబాలు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ సహాయం సమయానికి తొందరగా అందితే  కొంతమేలు జరుగుతుందని పేద కుటుంబాలు భావిస్తున్నాయి.  ప్రభుత్వ విభాగంలో ఇతర శాఖలకు, ఇతర ప్రభుత్వ పథకాలకు నిధులు కొంత ఆలస్యమైనాపర్వాలేదు కానీ... వైద్య విభాగంలోని పథకాలకు  వెనువెంటనే నిధులు మంజూరు చేయాలి. ప్రజలు. ముఖ్యంగా సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్) చెక్కుల మంజూరు విషయంలో ఆలస్యం చేయకుండా నెలలు,  నెలలు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉంచకుండా  సాధ్యమైనంత  త్వరగా  పరిశీలించి  వాస్తవాలు,  నిజనిర్ధారణ చేసి  త్వరగా  చెక్కులను విడుదల చేసి పేద కుటుంబాలకు భరోసాగా ప్రభుత్వం నిలవాలి. ప్రజలు.  ప్రజా ప్రతినిధి అధికార, ప్రతిపక్షం అనే తేడా లేకుండా వైద్యం(ఆరోగ్యం) విషయంలో  వారి  సిఫారసుతో వచ్చిన అన్నింటిని సమ ప్రాధాన్యతనిచ్చి చెక్కులను విడుదల చేయాలి.

విడుదలలో వేగం పెంచాలి

ఆత్మీయ సోదరుడు  ఒకతను  ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకుని దాదాపు ఎనిమిది నెలల క్రితం ఒక ప్రజా ప్రతినిధి సిఫారసుతో దరఖాస్తు చేసుకున్నాడు. ఇప్పటివరకు ఇంకా ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ పరిశీలనలోనే ఉన్నట్టు చూపిస్తోంది.  నిరుపేద కుటుంబాలు అత్యవసర సమయంలో అప్పుచేసి లక్షలు వెచ్చించి వైద్యం చేయించుకున్న పరిస్థితి,  ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అండగా ఉంటుందనే భరోసాతో... అధిక వడ్డీ అయినాసరే అప్పు చేసి వైద్యం చేయించారు.  ప్రస్తుతం మళ్లీ  సోదరుడికి ఆరోగ్యం క్షీణిస్తోంది.  మళ్లీ  రోగం తిరగబడితే  ప్రాణాలకే ప్రమాదమని కుటుంబమంతా దుఃఖిస్తున్న పరిస్థితి నెలకొంది. కాబట్టి ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కుల  విడుదలలో వేగం పెంచాలి.  బాధితులు వెచ్చించిన వైద్య ఖర్చులు పూర్తిగా కాకుండా చాలా శాతాన్ని తగ్గించి ఇస్తున్నారు. కానీ  పేద కుటుంబాలు పూర్తిస్థాయిలో ప్రభుత్వం అందించాలని  ఆశిస్తున్నాయి.  

-గుండమల్ల సతీష్ కుమార్

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ

openpage@v6velugu.com

రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 

హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.

రచన 700 పదాలకు మించరాదు.