వందేభారత్ రైళ్లలో కుక్కలకు ప్రత్యేక కంపార్ట్మెంట్

వందేభారత్ రైళ్లలో  కుక్కలకు  ప్రత్యేక కంపార్ట్మెంట్

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు పెంపుడు జంతువులకు ఇస్తున్న ఇంపార్టెన్స్ అంతా ఇంతా కాదు.  మనుషుల కంటే పెంపుడు జంతువులకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు కొందరు. పెంపుడు జంతువుల కోసం లక్షలకు లక్షలు ఖర్చు చేస్తుంటారు.  ప్రస్తుత రోజుల్లో  పల్లె నుంచి పట్నం వరకు  ప్రతీ ఇంట్లో పెంపుడు జంతువులు కామన్ అయిపోయాయి. అయితే అలాంటి పెంపుడు జంతువులున్న వారు దూర ప్రాంతాలకు జర్నీ చేసేటప్పుడు  సమస్యలు వస్తుంటాయి.  పెంపుడు జంతువులను వెంట తీసుకెళ్లాలంటే ఇబ్బంది తలెత్తుతోంది. 

అయితే చాలా మంది  జంతు ప్రేమికుల విజ్ఞప్తి మేరకు  కేంద్ర రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వందేభారత్ స్లీపర్ రైళ్లలో పెంపుడు జంతువులకు  ప్రత్యేక కంపార్ట్ మెంట్ ను ఏర్పాటు చేస్తుంది.   పెట్స్ ను వెంట తీసుకెళ్లే విధంగా ఏర్పాటు చేస్తుంది.  ఇప్పటికే ప్రారంభించిన వందేభారత్ రైళ్లలో కాకుండా కొత్త వెర్షన్ వందేభారత్ స్లీపర్ రైళ్లలో  పెంపుడు జంతువుల కోసం ప్రత్యేక కంపార్ట్ మెంట్ఉండేలా చూస్తోంది.

 లగేజ్ కంపార్టె మెంట్ పక్కన   పెంపుడు జంతువుల కంపార్ట్ మెంట్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో జంతువులను ఉంచేందుకు  ప్రత్యేకంగా రాక్స్   ఉంటాయి.  వీటి దగ్గర ప్రత్యేక  సిబ్బంది కూడా ఉంటారు.  ప్రయాణికుల కోచ్ కు ఈ కంపార్ట్ మెంట్ కు కమ్యూనికేషన్ ఉంటుంది. 

16 కోచ్ లతో ఉండే ఈ రైలు 2024 మార్చిలో పట్టాలెక్కే అవకాశం ఉంది.  చెన్నైలోని  ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ రైళ్లు రూపొందుతున్నాయి. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ తో కలిసి రష్యాకు చెందిన కీనెట్ రైల్వే సొల్యూషన్స్ 120 రైళ్లను తయారు చేయనుంది.