ప్రభాస్ ఫ్యాన్స్‎కు గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ మూవీ నుంచి క్రేజీ అప్డేట్

ప్రభాస్ ఫ్యాన్స్‎కు గుడ్ న్యూస్..  ‘స్పిరిట్’ మూవీ నుంచి క్రేజీ అప్డేట్

వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు  ప్రభాస్.  ప్రస్తుతం  మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’తో పాటు హను రాఘవపూడి రూపొందిస్తున్న చిత్రాన్ని కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు.  వీటి తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌‌లో తెరకెక్కనున్న  ‘స్పిరిట్’ మూవీ సెట్‌‌లో అడుగుపెట్టనున్నాడు. ఈ మూవీకి సంబంధించిన  క్రేజీ అప్‌‌డేట్‌‌ను అందించారు సందీప్​రెడ్డి అన్న  ప్రణయ్ రెడ్డి. ఇటీవల అమెరికాలో ఓ ఈవెంట్‌‌లో పాల్గొన్న ఆయన ఈ సినిమా గురించి మాట్లాడారు.

సెప్టెంబర్‌‌‌‌లో ‘స్పిరిట్’ మూవీ సెట్స్‌‌కు వెళ్లనుందని క్లారిటీ ఇచ్చారు. ఫస్ట్ షెడ్యూల్​నుంచే ప్రభాస్ షూటింగ్‌‌లో జాయిన్ అవుతారని రివీల్ చేశారు. మరోవైపు ఈ సినిమా కోసం ఎక్కువ డేట్స్​కేటాయించాలని  ప్రభాస్‎కు సందీప్ రెడ్డి రిక్వెస్ట్ చేశారంట. ఇందులో ప్రభాస్ కంప్లీట్ కొత్త లుక్, ఫిజిక్‎తో కనిపించనున్నాడని, అందుకే ఇలా అడిగినట్టు తెలుస్తోంది. ఈలోపు తన చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి సెప్టెంబర్‌‌‌‌ నుంచి కంప్లీట్‌‌గా ఈ మూవీ కోసమే టైమ్ కేటాయించాలని ప్రభాస్ కూడా డిసైడ్ అయ్యాడట.

హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌‌‌‌టైనర్‌‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రభాస్ డ్యూయెల్‌‌ రోల్ పోషించనున్నాడని, అందులో ఒకటి  పవర్‌‌‌‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌‌‌‌ పాత్రలో కనిపించనున్నాడని ఇప్పటికే రివీల్ చేశారు. హీరోయిన్‌‌గా త్రిప్తి డిమ్రిని సెలెక్ట్ చేశారు. టీ సిరీస్ బ్యానర్‌‌‌‌పై భూషణ్ కుమార్, సందీప్ రెడ్డి వంగా,  ప్రణయ్ రెడ్డి వంగా కలిసి భారీ బడ్జెట్‌‌తో నిర్మించనున్న ఈ చిత్రానికి హర్ష వర్ధన్ రామేశ్వరర్ సంగీతం అందిస్తున్నాడు.