
న్యూఢిల్లీ: సామాన్యులకు జీఎస్టీ కౌన్సిల్ గుడ్ న్యూస్ చెప్పింది. హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్‌పై జీఎస్టీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జీఎస్టీ తగ్గింపు కోసం కేంద్రం ప్రతిపాదించిన సంస్కరణల గురించి చర్చించడానికి కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన బుధవారం (సెప్టెంబర్ 3) 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశమైంది. ఈ భేటీలో కేంద్ర ప్రతిపాదించిన సంస్కరణల గురించి కూలంకషంగా చర్చించిన కౌన్సిల్.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.
జీఎస్టీ పన్ను రేట్లను రెండు శ్లాబులకు (5 శాతం, 18 శాతం) తగ్గించాలన్న కేంద్రం ప్రతిపాదనకు కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో 12, 18 జీఎస్టీ స్లాబులు రద్దు అయ్యాయి. 5, 18 శాతం జీఎస్టీ స్లాబులు కొనసాగనున్నాయి. అలాగే, హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్‌పై జీఎస్టీ రద్దుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. 2025, సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ స్లాబులు అమ్లలోకి రానున్నాయి.
హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ పై జీఎస్టీ రద్దుతో సామాన్యులకు తక్కువ ధరకే హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు లభించనున్నాయి. జీఎస్టీ కౌన్సిల్ తాజా నిర్ణయంతో చాలా మంది పేదలు, మధ్య తరగతి ప్రజలు హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకునేందుకు ముందుకు వచ్చేందుకు వచ్చే అవకాశం ఉంది. హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ పై జీఎస్టీ రద్దుపై సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.