కరీంనగర్ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) కింద రూ.840 కోట్ల పనులకు కేంద్రం ఆమోదం తెలిపింది. మోడల్ రోడ్లు, స్కైవాక్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు, జంక్షన్ అభివృద్ధికి 2026 మే 21న రూ.630 కోట్లు మంజూరు చేసింది.
డ్రెయిన్ల పునరుద్ధరణ, వరద నీటి నివారణ చర్యలకు రూ.130 కోట్లు ఆమోదం తెలిపింది. సమగ్ర ఘన వ్యర్థాల నిర్వహణ కోసం రూ.80 కోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆమోద లేఖ పంపారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి హీరాలాల్ మిశ్రా.
