
ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ ఆర్టీసీ డిపో నుంచి రెండు ఎక్స్‌ప్రెస్ సర్వీస్ లు చెన్నూర్‌కు వేస్తున్నట్లు డిపో మేనేజర్ రవికుమార్ మంగళవారం తెలిపారు. ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్ నుంచి మొదటి బస్సు ఉదయం 05.30 గంటలకు నిజామాబాద్ మీదుగా చెన్నూరు వెళుతుందని చెప్పారు. రెండో బస్ సర్వీస్ ఆర్మూర్ నుంచి ఉదయం 07.30 గంటలకు నిజామాబాద్ మీదుగా చెన్నూర్ వెళుతుందని తెలిపారు. చెన్నూరు రూట్ లో ప్రయాణించేవారు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.