
దుబాయ్: వచ్చే నెలలో న్యూజిలాండ్ వేదికగా జరిగే విమెన్స్ వన్డే వరల్డ్‌కప్‌నకు ముందు విమెన్ క్రికెటర్లకు ఐసీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. మెగా టోర్నీ ప్రైజ్‌మనీని భారీగా పెంచింది. మొత్తం ప్రైజ్‌మనీని గత ఎడిషన్‌తో పోలిస్తే 75 శాతం పెంచి రూ. 26 కోట్ల 34 లక్షలు గా నిర్ణయించింది. విన్నర్‌కు రూ. 9 కోట్ల 93 లక్షలు దక్కనున్నాయి. రన్నరప్ టీమ్‌కు రూ. 4 కోట్ల 51 లక్షలు ఇస్తారు. సెమీస్‌లో ఓడిన టీమ్స్‌కు చెరో రూ. 2 కోట్ల 25 లక్షలు కేటాయించారు. గ్రూప్ స్టేజ్‌లో గెలిచిన మ్యాచ్‌లకు రూ. 18 లక్షలు ఇస్తారు.