గుడ్ న్యూస్ : 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

గుడ్ న్యూస్ : 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి.. హైకోర్టు డివిజన్ బెంచ్ లైన్ క్లియర్ చేసింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ.. ప్రక్రియ మొదలు పెట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. ఈ తీర్పుతో 15 వేల 640 మంది అభ్యర్థుల ఉద్యోగాలకు లైన్ క్లియర్ అయినట్లే.. వివరాల్లోకి వెళితే...

ఎట్టకేలకు తెలంగాణ కానిస్టుబుల్ ఉద్యోగాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 15వేల 640  కానిస్టేబుల్ పోస్టులకు భర్తీకి గ్రీన్ ఇచ్చింది.  కానిస్టేబుళ్ల నియమాకంపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది.

కానిస్టేబుల్ ప్రశ్నాపత్రంలో నాలుగు ప్రశ్నలకు మార్కులు  కలపాలని గతంలో సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ మరో పిటిషన్ వేశారు కానిస్టేబుల్ ఉద్యోగాలను సెలక్ట్ అయిన అభ్యర్థులు. ప్రశ్నల తప్పిదాలపై ఇండిపెండెంట్ ఎక్స్ పర్ట్ కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లో కానిస్టేబుల్ సెలక్షన్ ప్రాసెస్ పూర్తి చేయాలని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డును  హైకోర్టు ఆదేశించింది.