కంపెనీల బాండ్లు, ఎఫ్‌‌‌‌డీలతో మంచి లాభాలు!

కంపెనీల బాండ్లు, ఎఫ్‌‌‌‌డీలతో  మంచి లాభాలు!
  • ఎన్‌‌‌‌‌‌‌‌బీఎఫ్‌‌‌‌‌‌‌‌సీల్లో 8 శాతానికి పైగా వడ్డీ
  • ఏఏఏ రేటింగ్ బాండ్లు  కొంటే సేఫ్టీ కూడా
  • రిస్క్ తీసుకోవాలనుకునే వారిని ఆకర్షిస్తున్న కార్పొరేట్ ఎఫ్‌‌‌‌‌‌‌‌డీలు

బిజినెస్‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రిస్క్‌‌‌‌‌‌‌‌ తీసుకోవడానికి వెనకడుగేయని డిపాజిటర్లు ఏడాదికి 8 శాతానికి పైగా వడ్డీ సంపాదించొచ్చు. ప్రభుత్వ బ్యాంకులు, కొన్ని పెద్ద ప్రైవేట్ బ్యాంకులు ఫిక్స్డ్‌‌‌‌‌‌‌‌ డిపాజిట్ల (ఎఫ్‌‌‌‌‌‌‌‌డీల) పై 7 శాతం నుంచి 7.5 శాతం మధ్యే వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. కానీ, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్‌‌‌‌‌‌‌‌బీఎఫ్‌‌‌‌‌‌‌‌సీలు) వీటి కంటే ఎక్కువ వడ్డీని ఇస్తుండడంతో పాటు సీనియర్ సిటిజన్స్‌‌‌‌‌‌‌‌కు అదనంగా 0.25 శాతం నుంచి 0.50 శాతం మధ్య వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. అంతేకాకుండా మాన్యుఫాక్చరింగ్ వంటి కంపెనీలు కూడా  తమ బాండ్లపై 8 శాతానికి పైగా వడ్డీ ఇస్తున్నాయి. కంపెనీల  కార్పొరేట్ ఎఫ్‌‌‌‌‌‌‌‌డీలు (బాండ్లు కొనడం లేదా డైరెక్ట్‌‌‌‌‌‌‌‌గా ఎఫ్‌‌‌‌‌‌‌‌డీ చేయడం) బ్యాంక్ ఎఫ్‌‌‌‌‌‌‌‌డీల కంటే రిస్క్‌‌‌‌‌‌‌‌తో కూడుకున్నవి. బ్యాంకుల్లో ఎఫ్‌‌‌‌‌‌‌‌డీలకు డిపాజిట్‌‌‌‌‌‌‌‌ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) నుంచి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. రూ.5 లక్షల వరకు గల బ్యాంక్ డిపాజిట్లపై ఇన్సూరెన్స్ ఉంటుంది. అదే ఎన్‌‌‌‌‌‌‌‌బీఎఫ్‌‌‌‌‌‌‌‌సీల్లోని డిపాజిట్లకు, కంపెనీల బాండ్లకు   డీఐసీజీసీ నుంచి  ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండదు.  కంపెనీ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే డిపాజిటర్లు తమ అసలు కూడా తిరిగి రాబట్టుకోలేరు.   

కార్పొరేట్‌‌‌‌‌‌‌‌ ఎఫ్‌‌‌‌‌‌‌‌డీల రిస్క్ తగ్గించుకోవచ్చు ఇలా..

రిస్క్ బట్టి రివార్డ్ ఉంటుంది. అధిక వడ్డీ కావాలంటే  ఎక్కువ రిస్క్ తీసుకోవాలి.  కార్పొరేట్ ఎఫ్‌‌‌‌‌‌‌‌డీలతో వచ్చే రిస్క్‌‌‌‌‌‌‌‌ను తగ్గించుకోవచ్చు. వీటిని ఎక్కువగా ఎన్‌‌‌‌‌‌‌‌బీఎఫ్‌‌‌‌‌‌‌‌సీలు, హౌసింగ్ ఫైనాన్స్  కంపెనీలు ఆఫర్ చేస్తుంటాయి. ఏఏఏ, ఏఏ రేటింగ్ ఉన్న కంపెనీల్లో ఎఫ్‌‌‌‌‌‌‌‌డీలు చేయాలి.  ఇవి మిగిలిన ఎన్‌‌‌‌‌‌‌‌బీఎఫ్‌‌‌‌‌‌‌‌సీల కంటే సేఫ్‌‌‌‌‌‌‌‌ అని చెప్పొచ్చు. ఇలాంటి కంపెనీలు బ్యాంకుల ఎఫ్‌‌‌‌‌‌‌‌డీలపై కంటే 0.75– 1.00 శాతం వరకు ఎక్కువ వడ్డీని ఆఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తుంటాయి. అంతేకాకుండా వివిధ టెనూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (కాల పరిమితులు)లలో ఎఫ్‌‌‌‌‌‌‌‌డీలు తీసుకోవచ్చు. వడ్డీ  నెలకొకసారి లేదా 6 నెలలకొకసారి లేదా ఏడాదికొకసారి పొందొచ్చు.

క్రెడిట్ రేటింగ్ ఫస్ట్‌‌‌‌‌‌‌‌..

కార్పొరేట్ ఎఫ్‌‌‌‌‌‌‌‌డీలు తీసుకునేముందు సంబంధిత కంపెనీ క్రెడిట్ రేటింగ్‌‌‌‌‌‌‌‌ను పరిగణనలోకి  తీసుకోవడం చాలా ముఖ్యం. క్రిసిల్‌‌‌‌‌‌‌‌, ఇక్రా, ఫిచ్‌‌‌‌‌‌‌‌, కేర్ వంటి రేటింగ్ ఏజెన్సీ సంస్థలు కంపెనీలకు ఈ రేటింగ్‌‌‌‌‌‌‌‌లను ఇస్తాయి. చాలా కంపెనీలు తమ క్రెడిట్ రేటింగ్‌‌‌‌‌‌‌‌ను  వెబ్‌‌‌‌‌‌‌‌సైట్లలో డిస్‌‌‌‌‌‌‌‌ప్లే చేస్తాయి. ఉదాహరణకు మహీంద్రా ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌ క్రిసిల్‌‌‌‌‌‌‌‌ నుంచి ఏఏఏ రేటింగ్‌‌‌‌‌‌‌‌ (వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌ ప్రకారం) పొందింది. ముత్తూట్‌‌‌‌‌‌‌‌ క్యాపిటల్ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌ రేటింగ్ క్రిసిల్ నుంచే ఏ ప్లస్‌‌‌‌‌‌‌‌గా ఉంది. ఇలా రేటింగ్ ఏఏఏ నుంచి ఏఏకి, ఏ+ కి పడిపోయే కొద్దీ ఈ కంపెనీలు ఇచ్చే ఎఫ్‌‌‌‌‌‌‌‌డీలపై రిస్క్‌‌‌‌‌‌‌‌ ఎక్కువగా ఉంటుందని అర్థం. ఎన్‌‌‌‌‌‌‌‌బీఎఫ్‌‌‌‌‌‌‌‌సీల్లో ఎఫ్‌‌‌‌‌‌‌‌డీలు చేయాలనుకునే వారు ఈ కంపెనీల క్రెడిట్ రేటింగ్‌‌‌‌‌‌‌‌తో పాటు మరిన్ని విషయాలను ఫాలో అవ్వాలి. ఎన్‌‌‌‌‌‌‌‌బీఎఫ్‌‌‌‌‌‌‌‌సీలు ఇచ్చిన లోన్లలో సెక్యూర్డ్ లోన్లు, అన్‌‌‌‌‌‌‌‌ సెక్యూర్డ్ లోన్లు ఎలా ఉన్నాయో చూసుకోవాలి. కంపెనీల యాన్యువల్ రిపోర్ట్స్‌‌‌‌‌‌‌‌, ఫైనాన్షియల్ స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్స్ చదవాలి. మొదట సంబంధిత కంపెనీ రూల్స్‌‌‌‌‌‌‌‌ను ఫాలో అవుతోందో లేదో చెక్ చేయాలి.

బాండ్లతోనూ మంచి రిటర్న్స్‌‌‌‌‌‌‌‌..

 కంపెనీలు ఎప్పటికప్పుడు నాన్‌‌‌‌‌‌‌‌ కన్వర్టబుల్ బాండ్లు (ఎన్‌‌‌‌‌‌‌‌సీడీ), ఇతర టైప్ బాండ్లను ఇష్యూ చేసి ఇన్వెస్టర్ల నుంచి డబ్బులు సేకరిస్తుంటాయి. ఈ బాండ్లను కొన్న కస్టమర్లు సాధారణంగా ఎన్‌‌‌‌‌‌‌‌బీఎఫ్‌‌‌‌‌‌‌‌సీలు ఇచ్చే  వడ్డీతో సమానంగా రిటర్న్‌‌‌‌‌‌‌‌ పొందుతారు.  సేఫ్టీ ముఖ్యమనుకునే ఇన్వెస్టర్లు ఏఏఏ రేటింగ్ ఉన్న బాండ్లను కొనాలని, ఈ మధ్య కాలంలో ఈ టైప్ బాండ్లు డీఫాల్ట్ కాలేదని ఫిన్‌‌‌‌‌‌‌‌ఎడ్జ్‌‌‌‌‌‌‌‌ చీఫ్ బిజినెస్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనిరుద్ధా బోస్‌‌‌‌‌‌‌‌ అన్నారు. ఏఏ, ఏ రేటింగ్ ఉన్న కంపెనీల బాండ్లలో రిస్క్‌‌‌‌‌‌‌‌ ఉంటుందని, కానీ ఈ కంపెనీలు అంత ఈజీగా డీఫాల్ట్ అవ్వవని వెల్లడించారు.  కార్పొరేట్ ఎఫ్‌‌‌‌‌‌‌‌డీలు తీసుకునే ముందు కంపెనీల క్రెడిట్‌‌‌‌‌‌‌‌ రేటింగ్ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ను ఇన్వెస్టర్లు చదవాలని, కంపెనీ పనితీరును, బిజినెస్‌‌‌‌‌‌‌‌ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి వీలుంటుందని నువమా వెల్త్‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌ జైన్ అన్నారు.