నైరుతిలో మంచి వర్షపాతం నమోదు

నైరుతిలో మంచి వర్షపాతం నమోదు

ఈ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కురవాల్సిన దానికంటే ఎక్కువ వర్షపాతం నమోదు

సాధారణం 431 మిల్లీమీటర్లయితే 509 మిల్లీమీటర్ల వాన

19 మండలాల్లో సాధారణం, 12 మండలాల్లో అంతకుమించి

పత్తి రైతులకు మరింత మేలంటున్న అగ్రికల్చర్ ఆఫీసర్లు

ఈనెలాఖరుతో ముగియనున్న నైరుతి రుతుపవనాలు

నల్గొండ, వెలుగు నైరుతి రుతుపవనాలు నల్గొండ జిల్లాకు భాగానే కలిసొచ్చాయి. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సాధారణానికి మించి వర్షాపాతం నమోదైంది. రుతుపవనాలు జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రారంభమై సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చివర్లో ముగుస్తాయి. అయితే ఈ సారి సకాలంలోనే వరుణుడు కరుణించడంతో పాటు, కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోనూ రికార్డు స్థాయిలో వానలు పడ్డాయి. దీంతో ఉమ్మడి జిల్లాకు వరప్రదాయినిగా భావించే నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. మరోవైపు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కురుస్తున్న భారీ వర్షాలతో మూసీలో సైతం నీటి నిల్వలు భారీగానే చేరాయి. జిల్లాలో జూన్​1 తేదీ నుంచి సెప్టెంబర్​ 14 వరకు సాధారణ వర్షపాతం 431 మిల్లీమీటర్లు కాగా, ఇప్పటివరకు 509 మిల్లీమీటర్లు పడింది. నల్గొండ జిల్లాలోని 31 మండలాలకుగాను 12 మండలాల్లో సాధారణానికి మించి వాన పడగా, మిగిలిన 19 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. దీంతో అన్ని మండలాల్లోని చెరువులు, కుంటలు, వాగులు జలకళను సంతరించుకున్నాయి. భూగర్భజలాలు కూడా గతేడాదితో పోలిస్తే 6.46 మీటర్లు పైకి వచ్చాయి. ఈ సీజన్ మొత్తంలో గత 20 రోజులు మాత్రమే వాన పడలేదు. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వల్ల రెండు రోజులుగా భారీ వానలే పడుతున్నాయి. దీంతో రికార్డు స్థాయిలో సాగు చేసిన పత్తికి మరింత మేలు చేసినట్లైంది. జిల్లాలోని చిట్యాల, కట్టంగూరు, నకిరేకల్​, తిప్పర్తి, మునుగోడు, నిడమనూరు, మాడ్గులపల్లి, వేములపల్లి, దామచర్ల, అడవిదేవులపల్లి, తిరుమలగిరిసాగర్​, పెద్దవూర, నాంపల్లి, పీఏపల్లి, నేరేడుగొమ్ము, కొండమల్లేపల్లి, దేవరకొండ, డిండి, చందంపేట మండల్లాలో సాధారణ వర్షాపాతం నమోదైంది. నార్కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, శాలిగౌరారం, కేతేపల్లి, నల్గొండ, కనగల్, చండూరు, అనుముల, త్రిపురారం, మిర్యాలగూడ, మర్రిగూడ, చింతపల్లి, గుర్రంపోడు మండలాల్లో రికార్డు స్థాయిలో వాన పడింది. జిల్లాలో ఎప్పుడూ అతితక్కువ వర్షపాతం నమోదయ్యే మర్రిగూడ, చింతపల్లి, చండూరు, గుర్రంపోడు మండలాల్లో సైతం ఈ సారి అధిక వర్షం పడడంతో కరువు ఛాయలు లేకుండా పోయాయి.

పైకొచ్చిన పాతాళగంగ

రుతు పవనాల సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వరుసగా తుఫాన్లు రావడంతో జిల్లాలో మునుపెన్నడూ లేని రీతిలో గ్రౌండ్ వాటర్ రికార్డు స్థాయిలో పెరిగింది. గతేడాది ఆగస్టులో 31 మండలాల్లో భూగర్భ జలమట్టాలు 14.61 మీటర్లు ఎత్తులో ఉండగా, ఈ ఏడాది అదే రోజుల్లో 8.16 మీటర్ల ఎత్తుకు చేరాయని భూగర్భజలవనరుల శాఖ నివేదికలో తేలింది. డిండి మండలంలో 0.51 మీటర్ల ఎత్తులోనే నీటిమట్టాలు ఉండటం విశేషం. అదేవిధంగా వేములపల్లి మండలంలో 0.52 మీటర్లు, దామరచర్లలో 0.98, తిరుమలగిరి సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 1.40, శాలిగౌరారంలో 1.98, నార్కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లిలో 2.28, కట్టంగూరులో 2. 98 మీటర్ల లోతులోనే నీటి మట్టాలు ఉన్నాయి.

పత్తి పంటకు మేలు

జిల్లాలో రికార్డు స్థాయిలో పత్తి పంట సాగైంది. వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం ఈ ఏడాది పత్తి పంట 7.21 లక్షల ఎకరాల్లో వేశారు. పత్తి విత్తనాలు నాటి నుంచి మెట్ట పంటలకు అనువైన వర్షాలకే కురుస్తున్నాయి. పత్తిపంటకు అవసరమయ్యే సస్యరక్షణ చర్యలను రైతులు చకచకా పూర్తిచేసుకున్నారు. ప్రస్తుతం పత్తి చేలు ఏపుగా పెరిగి పూత, పిందె, కాయలు వేయడం వేగంగా జరిగిపోయాయి. అయితే గత ఇరవై రోజులుగా వానలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. ఇప్పుడు ఏర్పడిన అల్పపీడన ద్రోణితో రైతులు సంతోషంగా ఉన్నారు. పత్తి చేలు కాయలు బాగా కాసి దిగుబడులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు.

ముంచెత్తిన వాన

ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటలకు వరకు జిల్లాలోని 31 మండలాల్లో 25.9 మిల్లీమీటర్ల వాన పడింది. అత్యధికంగా కేతేపల్లి మండలంలో 101 మిల్లీమీటర్లు పడగా, అత్యల్పంగా నాంపల్లి మండలంలో 6.3 మిల్లమీమీటర్ల వాన పడింది. ఈ వానలతో జిల్లాలో చాలా చోట్ల చెరువులు, కుంటలు పొంగిపొర్లాయి. పలు గ్రామాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాలా చోట్ల వరి, పత్తి చేలు నీట మునిగాయి.

నీట మునిగిన పంటలు

వలిగొండ/మునగాల, వెలుగు : రెండు రోజులుగా పడుతున్న వానల కారణంగా యాదాద్రి జిల్లా వలిగొండ, సూర్యాపేట జిల్లా మునగాలలో పంటలు నీట మునిగాయి. వలిగొండతో పాటు, నర్సాపురం, మల్లేపల్లి, అరూరు, తదితర గ్రామాల్లో 525 ఎకరాల్లో వరి, 125 ఎకరాల్లో పత్తి దెబ్బతింది. సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని తాడ్వాయి, గణపవరం చెరువులు అలుగులు పోయడంతో పంట పొలాలు నీట మునిగాయి. బేతవోలు చెరువులోకి కూడా నీరు భారీగా చేరడంతో బరాఖత్ గూడెం వరకు పొలాల్లో నీరు నిలిచింది.

నీట మునిగిన ఇండ్ల పరిశీలన

కిరేకల్ (రామన్నపేట), వెలుగు: వానల కారణంగా యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం సూరారంలో సుమారు 50 ఇండ్లు నీట మునిగాయి. దీంతో సోమవారం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గ్రామాన్ని పరిశీలించి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. అనంతరం బాధితులకు రూ. లక్ష సాయం అందజేసి, ప్రభుత్వం తరఫున అన్ని వసతులు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.