ఇప్పటికీ ప్లాపీ డిస్కులను వినియోగిస్తున్న దేశం ఉంది ..అదేంటో తెలుసా..

ఇప్పటికీ ప్లాపీ డిస్కులను వినియోగిస్తున్న దేశం ఉంది ..అదేంటో తెలుసా..

ప్లాపీ డిస్క్ లు ఇప్పుడు ఎక్కడైనా కనబడుతున్నాయా.. సీడీలు, డీవీడీలు కూడా చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. నిజానికి పాత రోజుల్లో దశాబ్దాల పాటు ఫ్లాపీడిస్క్ లు, సీడీ లు సేవలందించాయి. ప్రస్తుతం అడ్వాన్స్ డ్ టెక్నాలజీ యుగంలో డేటా స్టోరేజ్, డేటా షేరింగ్ కోసం ఇప్పుడు అంతా క్లౌడ్ స్టోరేజ్, డేటా డ్రైవ్ లను వినియో గిస్తున్నారు.

ఇంతకీ పాత తరం టెక్నాలజీ అయిన ప్లాపీ డిస్క్ లు, సీడీలను గురించి ఎందుకు ప్రస్తావనకు వచ్చిందటే.. ఈ డివైజ్ లను ఇప్పటికీ జపాన్ లాంటి కొన్ని దేశాలు వినియోగిస్తున్నాయట. పర్యావరవరణ వ్యవస్థలో భాగంగా వీటిని వాడుతున్నారట.. అయితే జపనీయులకు కూడా వాటిపై కొంచెం విరక్తి కలిగింది. అందుకే వాటిని వినియోగించొద్దని జపాన్ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తెచ్చిందట..పూర్తి వివరాలేంటో చూద్దాం. 

టెక్నాలజీ పరంగా ప్రపంచంతో పోటీ పడుతున్న జపనీయులు పర్యావరణ వ్యవస్థలో భాగంగా ప్లాపీ డిస్క్ లు, సీడీలను ఇప్పటికీ వినియోగిస్తున్నారంటే ఆశ్చర్య మేస్తుంది. అయితే జపాన్ కూడా ఇప్పుడు రియలైజ్ అయింది. ఫ్లాపీలు, సీడీలకు స్వస్థి చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఆన్ లైన్ సపోర్టు అందించే క్లౌడ్ డేటా, డేటాస్టోరేజ్ వంటి ఆధునాతన టెక్నాలజీ వైపు వెళ్లాల్సిన అవసరం ఉందని గ్రహించింది. గత నెలలో జపాన్ ప్రభుత్వం ఫ్లాపీ డిస్క్ లను వినియోగాన్ని రద్దు చేస్తూ కొత్త చట్టాన్ని తెచ్చింది.