V6 News

ఇయ్యాల్టి నుంచి (డిసెంబర్ 10) ఆరు రాష్ట్రాల్లో గూడ్స్ లారీల బంద్

ఇయ్యాల్టి  నుంచి (డిసెంబర్ 10) ఆరు రాష్ట్రాల్లో గూడ్స్ లారీల బంద్

హైదరాబాద్ సిటీ, వెలుగు: పెంచిన టెస్టింగ్‌‌‌‌ చార్జీలు, ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ చార్జీలను కేంద్ర ప్రభుత్వం వాపస్‌‌‌‌ తీస్కోవాలని సౌత్​ ఇండియా మోటార్​ ట్రాన్స్​పోర్ట్ అసోసియేషన్​ డిమాండ్​ చేసింది.ఈ మేరకు మంగళవారం అర్ధరాత్రి నుంచి బంద్​ పాటిస్తున్నామని, సమ్మె కొనసాగుతుందని ప్రకటించింది. ఈ సందర్భంగా అసోసియేషన్​ అధ్యక్షుడు అంజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి దుర్గా ప్రసాద్ మాట్లాడారు.

 పాత వాహనాలను రోడ్లపైకి రాకుండా ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సంప్రదింపులు జరిపేందుకు అధికారులు కూడా సహకరించకపోవడంతో సమ్మె తప్పట్లేదన్నారు. ఇప్పటివరకు 13 సంవత్సరాలుదాటిన వాహనాల ఫిట్‌‌‌‌నెస్, టెస్టింగ్​ కోసం రూ.12 వేలు వసూలు చేసేవారని, పెంచిన ఫీజుల ప్రకారం ఇప్పుడు రూ.30 వేలు చెల్లించాల్సి వస్తోందని వాపోయారు.