ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి లోకో పైలెట్ లేకుండానే వెళ్లిన ట్రైన్

ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి లోకో పైలెట్ లేకుండానే  వెళ్లిన ట్రైన్

పంజాబ్ రాష్ట్రంలో పెను ప్రమాదం తప్పింది. జమ్ము కాశ్మీర్ రాష్ట్రం పంజాబ్ వరకు  లోకో పైలట్ లేకుండానే ఓ గూడ్స్‌ రైలు దూసుకెళ్లింది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో సుమారు 70 కిలోమీటర్లు ప్రయణించింది. చివరకు ఓ గ్రామంలో ఆగిపోయింది. వివరాల్లోకి వెళితే జమ్మూ నుంచి గూడ్స్ రైలు నంబర్ 14806 పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ వెళ్తుంది. ఈ క్రమంలోనే లోకో పైలట్ గూడ్స్ రైలును జమ్మ కాశ్మీర్ రాష్ట్రంలోని కతువాలో ఆపాడు. 

పైలెట్ రైలు దిగి హ్యాండ్‌బ్రేక్‌ వేయకుండానే టీ తాగేందుకు వెళ్లాడు. ఇంతలో, రైలు అకస్మాత్తుగా కదలడం ప్రారంభించింది. చివరికి వేగం పుంజుకుంది. అలా దాదాపు 78కి.మీ మేర ప్రయాణించింది. అప్రమత్తమైన అధికారులు రైలును ఆపే ప్రయత్నం చేశారు. చివరకు పంజాబ్‌ లో హోషియార్‌పుర్‌ జిల్లాలోని ఓ రైల్వే స్టేషన్‌ సమీపంలో ఆగిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. 

 రైలు జమ్మూ కశ్మీర్‌ నుంచి పంజాబ్‌లోని హోషియార్‌పుర్‌ జిల్లాలోని ఓ గ్రామం వరకు అలాగే ప్రయాణించింది. మార్గమధ్యలో దాదాపు గంటకు 100 కి.మీ వేగంతో పరుగులు తీసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇసుక బస్తాలు, కర్రల సాయంతో రైలును నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని జమ్మూ డివిజనల్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ ప్రతీక్‌ శ్రీవాస్తవ ప్రకటించారు.

 ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డ్రైవర్ లేకుండా కారు వెళ్తున్నట్టు లోకో పైలెట్ లేకుండా ట్రైన్ వెళ్లిందని కామెంట్ చేస్తున్నారు.