
హైదరాబాద్, వెలుగు: కోవర్కింగ్ ప్లాట్‌ఫాం గుడ్‌వర్క్స్ కోవర్క్, రియల్ ఎస్టేట్ డెవలపర్ ఏక్తా గ్రూప్‌తో కలసి హైదరాబాద్ మార్కెట్‌లోకి అడుగుపెడుతోంది. భారత్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీ) ఎంటర్‌ప్రైజ్ హబ్‌గా ఎదుగుతున్న హైదరాబాద్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ వ్యూహాత్మక విస్తరణను ప్రకటించింది.
ఈ భాగస్వామ్యంలో భాగంగా, హైటెక్ సిటీ. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో 1.5 లక్షల చదరపు అడుగుల 'గ్రేడ్ ఏ' ఆఫీసు స్థలాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఈ కేంద్రాలను స్టార్టప్‌లు, గ్లోబల్ జీసీసీలకు అనుకూలంగా ఉండే విధంగా డిజైన్ చేస్తారు. ఇవి పూర్తిగా మేనేజ్‌డ్ ఆఫీస్ సొల్యూషన్లను అందించనున్నాయి.
గుడ్‌వర్క్స్ సంస్థ "సంసోవీ జీసీసీ" అనే ప్రత్యేక ప్లాట్‌ఫాంను కూడా ప్రారంభించనుంది. ఇది విదేశీ సంస్థలు భారత్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించాలనుకుంటే అవసరమైన మౌలిక సదుపాయాలను అందిస్తుంది. హైటెక్ సిటీ సెంటర్2025 మూడో క్వార్టర్లో, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆఫీసు ఈ సంవత్సరం చివర్లో ప్రారంభమవుతుందని గుడ్‌వర్క్స్ తెలిపింది.