జీతంలోనూ కోత విధించుకోనున్న గూగుల్  సీఈవో

జీతంలోనూ కోత విధించుకోనున్న గూగుల్  సీఈవో

ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీలను ఆర్థిక మాంద్యం వణికిస్తోంది. దీంతో భారీ సంఖ్యలో ఉద్యోగులను పలు దిగ్గజ కంపెనీలు సైతం ఇంటికి సాగనంపుతున్నాయి. ఉన్న ఉద్యోగుల జీతాలకు కోతపెడుతున్నాయి. ఈ క్రమంలోనే గూగుల్  సీఈవో సుందర్ పిచాయ్ కీలక నిర్ణయం వెల్లడించారు. ఇటీవలే తన కంపెనీలో 12వేల మందిని తీసివేస్తున్నట్టు ప్రకటించిన ఆయన.. తాజాగా తన జీతంలో కోత విధించుకోనున్నట్టు స్పష్టం చేశారు.

ఇప్పటికే సీనియర్  వైస్  ప్రెసిడెంట్, ఆపై స్థాయి ఉద్యోగుల వేతనాల్లో కోత ఉంటుందని సుందర్ పిచాయ్ ప్రకటించారు. ఇప్పుడు తన జీతంలో కూడా కోత విధించాలని సిబ్బందికి సూచించారు. అయితే కోత ఎంత మేరకు ఉంటుదన్నది మాత్రం వెల్లడించలేదు. ఇదిలా ఉంటే 2020 నాటికి సుందర్ పిచాయ్ 2 మిలియన్ల డాలర్లు జీతం తీసుకుంటున్నట్లు సమాచారం..! I.I.F.L - 2022 నివేదిక ప్రకారం పిచాయ్ నికర సంపద...20 శాతం మేర తగ్గి రూ.5,300 కోట్లుగా ఉంది. కాగా ఇటీవల యాపిల్ సీఈవో టిమ్ కుక్ కూడా తన జీతంలో 40 శాతం కోత విధించుకున్నారు.