గూగుల్‌ ఎంప్లాయ్స్‌కి వచ్చే ఏడాది జూన్‌ 30 వరకు వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌

గూగుల్‌ ఎంప్లాయ్స్‌కి వచ్చే ఏడాది జూన్‌ 30 వరకు వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌
  •  కరోనా నేపథ్యంలో నిర్ణయం

శాన్‌ఫ్రాన్సిస్కో: కరోనా మహమ్మారి రోజ రోజుకి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రముఖ సంస్థ గూగుల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. తన ఎంప్లాయిస్‌కి వచ్చే ఏడాది జూన్‌ 30 వరకు వర్క్‌ ఫ్రమ్‌హోమ్‌ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ ఉద్యోగులకు గూగుల్‌ సీఈవో సుందర్‌‌ పిచాయ్‌ మెయిల్స్‌ పంపారు. ఎంప్లాయిస్‌ ఆఫీసులకు వచ్చే అవసరం లేకుండా ఇంటి నుంచే పనిచేసే వీలు కల్పిస్తున్నట్లు చెప్పారు. జూన్‌ 30 వరకు ఆ వెసులుబాటు ఉందని ఆయన మెయిల్‌లో చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా గూగుల్‌లో పనిచేస్తున్న దాదాపు 2 లక్షల మందిపైగా ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. గూగుల్‌ ఈ నిర్ణయం తీసుకోవడంతో మిగతా కంపెనీలు కూడా ఆ దిశగా ఆలోచించే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా మహమ్మారి ప్రబలినప్పటి నుంచి దాదాపు అన్ని ఐటీ కంపెనీలు వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని కంపెనీలు పూర్తిగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఇస్తున్నట్లు చెప్పాయి.