సైనిక ఒప్పందాన్ని వ్యతిరేకించిన గూగుల్ ఉద్యోగి జాబ్ ఊస్ట్

సైనిక ఒప్పందాన్ని వ్యతిరేకించిన గూగుల్ ఉద్యోగి జాబ్ ఊస్ట్

గూగుల్ కంపెనీ ఇజ్రాయిల్ మిలటరీతో చేసుకున్న ఒపందాన్ని వ్యతిరేకిస్తూ ఓ ఉద్యోగి తన ఆవేదన వ్యక్తం చేశాడు. సదరు వ్యక్తిని గూగుల్ కంపెనీ టర్మినేట్ చేసింది. న్యూయార్క్ లో వార్షిక మిడ్ టెక్ కాఫిరెన్స్ లో ఓ ఎంప్లాయ్ ప్రసెంటేషన్ ఇస్తున్నారు. ఆ సందర్భంలో  గూగుల్ ఇజ్రాయిల్ బ్రాంచ్  ఉద్యోగి లేచి నిలబడి మరణహోమం, నిఘూను పెంచే సాంకేతికత రూపొందించడాన్ని  నేను నిరాకరిస్తున్నా అని అరవడం ప్రారంభించాడు. దీంతో ఒక్క సారిగా కాన్ఫరెన్స్ లో ఉన్న వారందరూ అతనిపైపు చూశారు. కొంతమంది అతన్ని అక్కడి నుంచి బయటకు తీసుకువెళ్లారు. 

ALSO READ :- ఫైనాన్స్ వేధింపులు.. కారు తగలబెట్టిండు

ఇజ్రాయిల్ గవర్నమెంట్ టెక్ దిగ్గజాలైన అమెజాన్, గూగుల్ కంపెనీలతో నింబస్‌ను ప్రాజెక్ట్ ను కుదుర్చుకుంది. ఇది 2021సంవత్సరంలో ప్రారంభమైన 1.2 బిలియన్ డాలర్ల ఒప్పందం. ఇజ్రాయిల్ మిలటరీకి క్లౌడ్ సేవలకు యాక్సెస్‌ను పెంపొందించేందుకు నింబస్ ప్రాజెక్ట్ కుదుర్చుకుంది. ఇది పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్ నిఘా పెంచడానికి, డేటా సులభంగా తెలుసుకుంటుందని ఆరోపణలు ఉన్నాయి. నింబస్ పై అనేక వివాదాలు ఉన్నాయి. గూగుల్ విధానాలకు నిరసన తెలిపిన ఆ ఉద్యోగిని అధికారి బెయిలీ టామ్సన్ కంపెనీ టర్మినేట్ చేసినట్లు తెలిపాడు. ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ జరిగిన ఘటన ఇదేం మొదటిది కాదు. ఇలాంటివి చాలా జరిగాయి.