ఫైనాన్స్ వేధింపులు.. కారు తగలబెట్టిండు

 ఫైనాన్స్ వేధింపులు..  కారు తగలబెట్టిండు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ శివారులోని ఓ రియల్ వెంచర్ లో మూర్తి అనే యువకుడు తన కారుకు తానే నిప్పంటించాడు. నారాయణ పేట జిల్లాకు చెందిన మూర్తి అనే యువకుడు హైదరాబాద్ లో 2018 మోడల్ షిఫ్ట్ సెకండ్ హ్యాండ్ కారు కొన్నాడు.  

శ్రీరామ ఫైనాన్స్ లో సుమారు 5 లక్షల రూపాయలు రుణం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు ఐదు నెలసరి వాయిదాలు చెల్లించాడు. మరో వాయిదా చెల్లించాల్సి ఉంది.  ఒక్క వాయిదాకే ఫైనాన్స్ వారు వేధిస్తున్నారని మనస్తాపం చెందిన మూర్తి కారుకు నిప్పంటించినట్లు తెలిపాడు. 

ALSO READ :- నారీ విజయభేరిలో బండి సంజయ్

ఫైరింజన్ వచ్చే వరకు కారు పూర్తిగా దగ్ధం అయ్యింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.