నారీ విజయభేరిలో బండి సంజయ్

నారీ విజయభేరిలో బండి సంజయ్

కరీంనగర్:  మహిళా దినోత్సవం రోజు మాత్రమే కాకుండా నిత్యం మహిళలను గౌరవిస్తేనే భరత మాతను మనం గౌరవించినట్లు అని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్  రెవిన్యూ గార్డెన్ లో మహిళా దినోత్సవం సందర్భంగా  నారీ విజయభేరి కార్యక్రమంలో పాల్గొని, ప్రసంగించారు. మోదీ ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసం 33 శాతం రిజర్వేషన్లు కల్పించిందని, మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ఆయన అన్నారు. 

ALSO READ :- Tata Motors: ఏప్రిల్ 1 నుంచి టాటా కార్ల ధరలు పెరగుతున్నాయి..

దేశ అత్యున్నత పదవిలో ద్రౌపది ముర్ము, ఆర్ధిక మంత్రిగా నిర్మలా సీతారామన్, మొట్ట మొదటి విదేశాంగ శాఖ మంత్రిగా సుష్మా స్వరాజ్ లను  నియమించామని చెప్పుకొచ్చారు. భారతదేశంలో  మహిళలను కొలుస్తూ,  పూజిస్తాస్తూ ఉంటామని అన్నారు. ప్రతి గ్రామంలో మహిళల కోసం టాయిలెట్స్, ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్లు వంటి సంక్షేమ పథకాలను  మోదీ ప్రధాని అయిన తరవాత మహిళలను దృష్టిలో పెట్టుకొని ప్రవేశ పెట్టారని కొనియాడారు. ముస్లిం మహిళల కోసం ట్రిపుల్ తలాక్ ప్రవేశ పెట్టారని సభా వేదికగా బండి సంజయ్ తెలిపారు.