నాడి పట్టేసింది : గూగుల్ నుంచి డాట్ మిమీ డొమైన్స్

నాడి పట్టేసింది : గూగుల్ నుంచి డాట్ మిమీ డొమైన్స్

టెక్నాలజీలో మీకో అడ్రస్ అంటే జీమెయిల్.. అదే బిజినెస్ మోడల్లో ఓ వెబ్ సైట్.. దానికో పేరు.. వెబ్ సైట్ పేర్లను కొనుక్కోవటానికి ఆన్లైన్ కంపెనీలు ఉంటాయి.. ఇప్పటి వరకు డాట్ కాం.. డాట్ ఇన్.. డాట్ ఓఆర్జీలోపాటు మనకు కావాల్సిన సొంత పేర్లతో క్రియేట్ చేసుకుని.. కొనుక్కోవచ్చు. మారిన కాలంతో.. కొత్తగా డొమైన్ నేమ్స్ తీసుకొస్తుంది గూగుల్. ఇక నుంచి డాట్ మీమ్.. .meme తో కొత్త పేర్లను అమ్మటానికి రెడీ అవుతుంది గూగుల్. ప్రస్తుతం జనరేషన్ ఎక్స్.. నెక్ట్స్ ఎక్స్ జనరేషన్ నడుస్తుంది. వీళ్లందరూ విషయం ఏదైనా సింగిల్ పంచ్తో చెప్పేస్తున్నారు.. ఇవన్నీ ఇప్పుడు మీమ్గా పాపులర్ అవుతున్నాయి. ఈ ట్రెండ్ క్యాష్ చేసుకునేందుకు.. డాట్ మీమ్.. .meme పేరుతో డొమైన్స్ ఇవ్వటానికి రెడీ అవుతుంది గూగుల్.

ప్రస్తుతం తీసుకొస్తున్న డాట్ మిమీకి ముందే డాట్ INGని ఇంట్రడ్యూట్ చేసింది గూగుల్. క్రియేటివిటీ ఫీల్డ్, ట్రావెల్, ఎడిటింగ్ బ్రౌజర్లు, వ్యాపారాలకు, ఆర్చీవ్స్ వంటి కంపెనీలు డాట్ ING ద్వారా పోర్టల్స్ నేమ్ క్రియేట్ చేసుకోవటానికి అవకాశం కల్పించింది గూగుల్.

దీనికి కొనసాగింపుగానే.. ఫన్నీ, చిట్ చాట్, పబ్లిక్, సోషల్ మీడియా కంటెంట్ క్రియేటివిటీ పర్సన్స్ కోసం సరికొత్తగా డాట్ మీమి డొమైన్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది గూగుల్. డాట్ మీమి ద్వారా మీమ్స్ క్రియేట్ చేసే వాళ్లందరికీ ఇది యూనివర్సల్ గా ఉంటుందని.. ప్రత్యేక గుర్తింపుతోపాటు ఈజీ సెర్చింగ్ కు అవకాశం ఉంటుందనేది గూగుల్ ఉద్దేశం. అందులో భాగంగానే.. డిసెంబర్ 5వ తేదీ నుంచి డాట్ మిమి డొమైన్స్ అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది గూగుల్.

Also Read:-ఈ హోటల్ కు 70 ఏళ్ల చరిత్ర.. కాలంతో మారలేక కనుమరుగు అవుతుంది