గూగుల్ డేటా సెంటర్లో అగ్ని ప్రమాదం

గూగుల్ డేటా సెంటర్లో అగ్ని ప్రమాదం

అమెరికాలో గూగుల్ డేటా సెంటర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఫలితంగా సెర్చింజన్ సేవల్లో కొంతసేపు అవాంతరం ఏర్పడింది. గూగుల్ అధికారిక ప్రతినిధి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. లోవాలోని కౌన్సిల్ బ్లఫ్ లోని గూగుల్ డేటా సెంటర్ లో జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో ముగ్గురు ఉద్యోగులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారికి కావాల్సిన సాయం అందించనున్నట్లు గూగుల్ ప్రతినిధులు చెప్పారు.

డేటా సెంటర్లో ప్రమాదం కారణంగా భారత్లో గూగుల్‌‌కు చెందిన చాలా సర్వీసుల్లో ఉదయం 6.37 గంటల నుంచి సేవలకు అంతరాయం ఏర్పడింది. 7 గంటల తర్వాత సమస్య మరింత తీవ్రమైనట్లు పలువురు ఫిర్యాదు చేశారు. 502 ఎర్రర్‌తో పాటు 500 ఎర్రర్ వస్తోందని ట్విట్టర్ లో కంప్లైట్స్ వెల్లువెత్తాయి. వెంటనే స్పందించిన గూగుల్ సమస్యను పరిష్కరించడంతో గూగుల్ సర్వీస్‌లన్నీ మళ్లీ అందుబాటులోకి వచ్చాయి.