గూగుల్ ఉద్యోగికి కరోనా

గూగుల్ ఉద్యోగికి కరోనా

బెంగళూరులో గూగుల్ కంపెనీలో పని చేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా వైరస్ సోకింది.  బెంగళూరులోని గూగుల్ సంస్థలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా వైరస్ సోకిందని అధికారికంగా ప్రకటించారు. దీంతో ఆయన్ను ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అదేసమయంలో క్యాంపస్‌లోని ఉద్యోగులందరినీ ‘వర్క్ ఫ్రమ్ హోం’కు ఆదేశించారు.

గూగుల్ పనిచేసే ఉద్యోగి ఇటీవలే తన భార్యను తీసుకుని హనీమూన్ కోసం స్విట్జర్లాండ్ మరియు గ్రీస్ దేశాలకు వెళ్లివచ్చారు. తిరిగి వచ్చాక భర్తకు కరోనా సోకిందని తెలియగానే అతని భార్య ఆగ్రాలో ఉన్న పుట్టింటికి వెళ్లిపోయింది. ఈమె బెంగళూరు నుంచి విమానంలో ఢిల్లీ చేరుకుని అక్కడి నుంచి ఆగ్రాకు చేరుకుంది. గూగుల్ ఉద్యోగిపై దృష్టి పెట్టిన వైద్యాధికారులు వారు ఇటలీ వెళ్లి వచ్చిన విషయాన్ని గుర్తించారు.

సవరణ:

గూగుల్ ఉద్యోగికి కరోనా వచ్చిందని ఆయన భార్య తన పుట్టింటి వెళ్లిపోయారనేది తప్పు.  స్విట్జర్లాండ్ మరియు గ్రీస్ దేశాలకు టూర్ తర్వాత ఆమె ఆగ్రాలోని తన పుట్టింటికి మార్చి 9వ తేదీన వెళ్లారు. ఆ తర్వాత… ఆమె భర్తకు మార్చి 12న కరోనా వైరస్ ఉన్నట్లు తేలింది. అంతేకాదు ఆమె అసలు బెంగళూరు సిటీలోనికే రాలేదు. టూర్ నుంచి వచ్చి అప్పుడే బెంగళూరు విమానాశ్రయం నుంచే ఆగ్రా వెళ్లిపోయారు.