గూగుల్ AI టూల్ : ఎలా కావాలంటే అలా సంగీతం కొట్టి ఇస్తుంది..

గూగుల్ AI టూల్ : ఎలా కావాలంటే అలా సంగీతం కొట్టి ఇస్తుంది..

సంగీత ప్రియులకు శుభవార్త.. సంగీత వినడమే కాదు.. ఇప్పుడు మీరు కూడా మ్యూజిక్ కంపోజ్ చేయొచ్చు..ఎట్లంటారా..గూగుల్ ప్రత్యేకంగా సంగీతం కోసం Google Ai టూల్ ను పరిచయం చేస్తోంది. ఇన్ స్ట్రుమెంట్ ప్లే గ్రౌండ్ అనే కొత్త AI పవర్ టూల్ ను రూపొందించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎన్ని సంగీత పరికరాలు న్నాయో .. అన్నింటి ద్వారా మనం సంగీతాన్ని కంపోజ్ చేసేందుకు ఉపయోగపడుతుంది. 

భారత్ నుంచి వీణ, చైనా నుంచి డీజీ, జింబాబ్వే నుంచి MBria వంటి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫేమస్ సంగీత వాయిద్యాలతో మనం సంగీతాన్ని కంపోజ్ చేయొచ్చు. వినియోగదారులు తమకు కావాల్సిన సంగీత పరికరాలను ఎంచుకోవచ్చు. ఇది 20 సెకన్ల్ సౌండ్ క్లిప్ ను రూపొందిస్తుంది. దీంతో పాటు 2024 మే లో Music LM text to music AI Tool కూడా వినియోగదారులకు పరిచయం చేస్తుంది. 

వివిధ రకాల సౌండ్లను ఎక్స్ పోజ్ చేసేందుకు ఆంబియంట్ నుంచి బీట్, బీట్ నుంచి పిచ్ ఇలా రకరకాల మోడ్ లను ఎంచుకొని సౌండ్ క్లిప్ లను సృష్టించడానికి ఈ టూల్ ఉపయోగపడుతుంది. హ్యాపీ, మూడీ, రొమాంటిక్ ఫీలింగ్స్ తెలిపే సంగీతాన్ని మనం కంపోచ్ చేసేందుకు రకరకాల అడ్జస్ట్ మెంట్స్ ఉంటాయి. సో... ఎంజాయ్..