ముగ్గురు మొబైల్ స్నాచర్ల అరెస్టు

ముగ్గురు మొబైల్ స్నాచర్ల అరెస్టు

పద్మారావునగర్​, వెలుగు: సెల్ ఫోన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న ముగ్గురిని గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను గోపాలపురం ఏసీపీ సుబ్బయ్య సోమవారం మీడియాకు వెల్లడించారు. చిలకలగూడకు చెందిన మదన రవితేజ అలియాస్ బన్నీ(21), బల్లనాగ చెన్నకేశవరావు(21) పలు నేరాలకు పాల్పడడంతో పోలీసులు రౌడ్​షీట్​ తెరిచారు. వీరు మెట్టుగూడకు చెందిన 15 ఏళ్ల బాలుడిని కలుపుకొని మొబైల్ స్నాచింగ్ కు పాల్పడుతున్నారు . 

జూన్​ 28న సాయంత్రం దుర్గారావు అనే క్యాబ్ డ్రైవర్ సికింద్రాబాద్ వద్ద వేచి ఉండగా బెదిరించి సెల్ ఫోన్ లాక్కొని పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదివారం చిలకలగూడ చౌరస్తాలో పట్టుకున్నారు. మూడు సెల్ ఫోన్లు, వాలెట్లు, స్మార్ట్ వాచీ, బైక్​ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని రిమాండ్​కు తరలించి బాలుడిని జువెనైల్ హోంకు పంపించారు. సమావేశంలో గోపాలపురం ఇన్​స్పెక్టర్ మధు కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.