హను మకొండ సిటీలోని అపరి శుభ్రతను తొలగించి.. ఆహ్లాదాన్ని సృష్టించి..

హను మకొండ సిటీలోని అపరి శుభ్రతను తొలగించి.. ఆహ్లాదాన్ని సృష్టించి..

హనుమకొండ సిటీలోని గోపాల్​పూర్​ చెరువు పరిసరాలు ఎన్నో ఏండ్ల నుంచి చెత్తతో నిండి, ముక్కు మూసుకుని వెళ్లేలా దుర్వాసన వెదజల్లేది. స్థానికులు ఈ విషయంపై ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడంతో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్​రెడ్డి, కేఆర్ నాగరాజు, మేయర్​ గుండు సుధారాణి, కమిషనర్​ చాహత్​బాజ్​పాయ్​ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. స్వచ్ఛ సర్వేక్షణ్​లో భాగంగా ఆ ప్రాంతాన్ని ఆకట్టుకునేలా సుందరీకరించారు.

అపరిశుభ్రతను తొలగించి, కుర్చీలు ఏర్పాటు చేసి ఉద్యానవనాన్ని నిర్మించి, ఆహ్లాదకరంగా మార్చడంతో జనం ఇక్కడ సెల్ఫీలు తీసుకుంటున్నారు.- వెలుగు, వరంగల్​ ఫొటోగ్రాఫర్​